Minister Peddireddy: తమది రైతు పక్షపాత ప్రభుత్వమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడమే లక్ష్యమన్నారు. ఇప్పటివరకు కొత్తగా 41 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. మరో 77 వేల కనెక్షన్‌లను త్వరలోనే ఇవ్వబోతున్నామని చెప్పారు. 2023 మార్చి నాటికి నూరు శాతం వ్యవసాయ కనెక్షన్‌లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తామని స్పష్టం చేశారు.
విద్యుత్ సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాలకే ప్రభుత్వం జమ చేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే 70 శాతం మంది రైతులకు డీబీటీ కోసం ఖాతాలను తెరిచారని తెలిపారు. అక్టోబర్ 15 నాటికి నూరు శాతం ఖాతాలను ఓపెన్ చేయడం పూర్తవుతుందన్నారు. స్మార్ట్ మీటర్ల వల్ల 30 శాతం మేర సబ్సిడీ చెల్లింపు ..ప్రభుత్వానికి ఆదా అవుతోందని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఇది నిరూపితం అయ్యిందన్నారు. స్మార్ట్ మీటర్లపై మాట్లాడే విపక్షాలు..క్షేత్ర స్థాయి పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
రైతులకు ఏ విధంగా నష్టం జరుగుతుందో అప్పుడు చెప్పాలన్నారు. చంద్రబాబు, ఆయనకు వంత పాడే జనసేన, కమ్యూనిస్టు నేతలే..రైతుల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. స్మార్ట్ మీటర్లు పెట్టే వారి చేతులు నరకాలని అనడం దారుణమన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎవరి చేతులను ఎవరూ నరకలేరు..ఇలాంటి మాటలతో వారి చేతులు వారే నరుక్కుంటున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల తర్వాత వారి పరిస్థితి ఏంటో అర్థమవుతుందన్నారు.
రాజకీయ స్వార్థం కోసం రైతులను అడ్డం పెట్టుకుంటున్నారని ఫైర్ అయ్యారు. స్మార్ట్ మీటర్ల వల్ల ఏ రైతుపైనా భారం పడదని స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యుత్ కోసం రైతులు పోరాటం చేయవచ్చని అన్నారు. నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఎలాంటి అంతరాయాలు లేకుండా అందిస్తున్నామని స్పష్టం చేశారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు తర్వాత కూడా ఆ భారమంతా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. దీనిపై ఎలాంటి అపోహలు పెట్టుకోవదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
రైతు సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. ఎన్నో దేశాలకు, రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో రైతుల్లో జవాబుదారితనం పెరుగుతుందన్నారు. ప్రభుత్వం జమ చేసే సబ్సిడీని వారే స్వయంగా డిస్కంలకు చెల్లిస్తారని తెలిపారు. ఇలా చేయడం వల్ల రైతులకు నాణ్యమైన విద్యుత్ అందుతుందని స్పష్టం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సమీక్షా సమావేశంలో ఇంధన శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!
Also read:Union Govt: ఏపీలో మరో కొత్త జాతీయ రహదారి..విజయవాడ నుంచి ఎక్కడి వరకో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి