Sputnik Light: డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) మరో కరోనా టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చింది. రష్యాకు చెందిన సింగిల్ డోసు టీకా అయిన.. స్పుత్నిక్​ లైట్​ వ్యాక్సిన్​కు అనుమతులు ఇచ్చినట్లు కేంద్రం ఆరోగ్య మంత్రి మన్సుఖ్​ మాండవియ ఆదివారం వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివిధ నియంత్ర నిబంధనలకు లోబడి.. పరిమితులతో కూడిన అనుమతులను స్పత్నిక్ లైట్​కు ఇచ్చినట్లు అధికారిక వర్గాలు వెల్లడిచాయి. సెంట్రల్ డ్రగ్​ అథారిటీ ప్యానెల్ సిఫార్సు ేసిన నిబంధనలన్నింటికి లోబడే ఈ అనుమతులు ఇచ్చినట్లు తెలిపాయి.


ఇక స్పుత్నిక్​ లైట్​.. దేశంలో అత్యవస వినియోగ అనుమతులు లభించిన తొమ్మిదో టీకా అని ప్రభుత్వం వెల్లడించింది.



ఇంతకు ముందే రష్యాకు చెందిన స్పుత్నిక్​ వికి భారత్​ అనుమతులు ఇచ్చింది గత ఏడాది జూన్ నుంచి ఈ టీకాలు అందుబాటులోకి వచ్చాయి.


ఈ టీకాలను డాక్టర్​ రెడ్డీస్ సహా వివిధ ఫార్మా సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. కాగా స్పుత్నిక్ వి రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది.


రష్యా, అర్జెంటీనాతో పాటు మొత్తం 29 దేశాలు ఇప్పటికే ఈ టీకా వినియోగానికి అనుమతులు మంజూరు చేశాయి.


ట్రయల్​ దశలో ఈ టీకా 65.4 శాతం సమర్థంగా పని చేసినట్లు తెలిసింది. దీనిపై ఇంకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరగుతున్నాయి.


Also read: Punjab Elections: పంజాబ్ సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్​ ప్రకటన- మరోసారి చన్నీకే అవకాశం


Also read: Covid-19 Cases in India: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, స్వల్పంగా తగ్గిన మరణాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook