Sputnik V Vaccine: సామర్ధ్యంలో స్పుట్నిక్ వి వ్యాక్సిన్‌ను మించింది లేదట
Sputnik V Vaccine: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇండియాలో ఇప్పుడు మూడవ వ్యాక్సిన్ అందుబాటులో వచ్చేసింది. తొలి రెండు వ్యాక్సిన్‌ల కంటే సామర్ధ్యంలో ఇది అద్భుతమని తెలుస్తోంది. ఈ వ్యాక్సిన్ సామర్ధ్యం ఏకంగా 91.6 శాతమంటున్నారు వైద్య నిపుణులు.
Sputnik V Vaccine: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇండియాలో ఇప్పుడు మూడవ వ్యాక్సిన్ అందుబాటులో వచ్చేసింది. తొలి రెండు వ్యాక్సిన్‌ల కంటే సామర్ధ్యంలో ఇది అద్భుతమని తెలుస్తోంది. ఈ వ్యాక్సిన్ సామర్ధ్యం ఏకంగా 91.6 శాతమంటున్నారు వైద్య నిపుణులు.
కరోనా మహమ్మారి(Corona Pandemic) ధాటికి జనం బెంబేలెత్తిపోతున్నారు. వ్యాక్సిన్ ఒక్కటే ప్రత్యామ్నాయంగా మారిన వేళ ఇండియాలో వ్యాక్సిన్ కొరత అధికంగా ఉంది. ఇండియాలో ప్రస్తుతం రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. భారత్ బయోటెక్( Bharat Biotech) కంపెనీ స్వయంగా అభివృద్ధి చేసిన స్వదేశీ వ్యాక్సిన్ కోవ్యాగ్జిన్(Covaxin). ఈ వ్యాక్సిన్‌ను డెడ్ లీ కరోనా వైరస్‌తో తయారు చేశారు. ఈ వ్యాక్సిన్ తొలిడోసుకు రెండవ డోసుకు మధ్య 4-6 వారాల అంతరముంది. ఇక సామర్ధ్యం విషయానికొస్తే 83 శాతంగా గణాంకాలు చెబుతున్నాయి. ఇక అందుబాటులో ఉన్న మరో వ్యాక్సిన్ సీరమ్ ఇనిస్టిట్యూట్(Serum Institute) ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్. ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్ కొమ్ముల్ని పోలినవాటితో అభివృద్ధి చేశారు. కోవిషీల్డ్(Covishield) తొలిడోసుకు రెండవ డోసుకు మధ్య అంతరం 12-16 వారాలుగా చేశారు. బ్రిటన్‌లో అయితే ఇదే వ్యాక్సిన్ 8 వారాల విరామం పాటిస్తున్నారు. దీని సామర్ధ్యం 70-90 శాతం వరకూ ఉందంటున్నారు.
ఇప్పుడు ఇండియాలో మూడవ వ్యాక్సిన్ అందుబాటులో వచ్చింది. రష్యా(Russia)లోని గమలేయా సంస్థ అభివృద్ధి చేసిన స్పుట్నిక్ వి వ్యాక్సిన్( Sputnik v vaccine)ను ఇండియాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తయారు చేయనుంది. ప్రస్తుతానికి రష్యా నుంచి దిగుమతి అవుతోంది. ఇండియాలో అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్‌లతో పోలిస్తే ఇది చాలా భిన్నమన వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ తయారీలో రెండు వేర్వేరు అడినోవైరస్‌లను ఉపయోగించారు.సాధారణ జలుబుకు కారణమైన ఏడీ26, ఏడీ5 వైరస్‌లు ఉపయోగించారు. ఈ వ్యాక్సిన్ రెండు డోసులు వేర్వేరుగా ఉంటాయి. తొలిడోసులో ఏడీ26 వైరస్ ఉంటే..రెండవ డోసులో ఏడీ 5 వైరస్ ఉంటుంది.
ప్రపంచంలో తొలిసారిగా రిజిస్టర్ అయిన వ్యాక్సిన్ కూడా ఇదే. దుష్ప్రభావాలు కూడా మిగిలిన వ్యాక్సిన్‌లతో పోలిస్తే స్పుట్నిక్ విలో చాలా తక్కువంటున్నారు వైద్య నిపుణులు. కొందరిలో ఎక్కువ కన్పించినట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనా స్పుట్నిక్ వి వ్యాక్సిన్ సామర్ధ్యం 91.6 శాతమని తయారీదారులు స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య అంతరం మూడు వారాలే.
Also read: Covid19: కోవిడ్ పాజిటివిటీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook