Covid19: కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించారు. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ చర్చించారు. కీలక సూచనలిచ్చారు.
కరోనా వైరస్ మహమ్మారి(Corona pandemic) రోజురోజుకూ తీవ్రమౌతోంది. కరోనా సెకండ్ వేవ్ ధాటికి జనం విలవిల్లాడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నా ఇతర రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువవుతోంది. ఈ క్రమంలో ప్రదాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాలపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి పెట్టారు. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. తరచూ వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ అవసరమైన సూచనలిస్తున్నారు. కోవిడ్ పాజిటివిటీ అధికంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ ఉన్నతాధికారులతో భేటీ అవుతున్నారు.
ఇవాళ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ (Pm Narendra modi) నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామిలతో సంభాషించారు. కరోనా నివారణ చర్యలపై ఆరా తీశారు. మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, గుజరాత్ ముఖ్యమంత్రులతోనూ మాట్లాడాల్సి ఉన్నప్పటికీ తౌక్టే తుపాన్ కారణంగా వాయిదా వేశారు. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇప్పటికే తుపాన్ అప్రమత్తతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit shah) మాట్లాడారు.
Also read: Black Fungus Threat: ప్రాణాంతక బ్లాక్ ఫంగస్‌పై హెచ్చరికలు జారీ చేసిన ఎయిమ్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook