Aryan Khan: డ్రగ్స్ కేసు(Drugs case)లో షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయి..రెండు వారాలు దాటింది. ప్రస్తుతం ఆర్యన్(Aryan Khan) అర్థర్ రోడ్ లోని సెంట్రల్ జైలులో ఉన్నాడు. కొడుకు జైల్లో ఉండటంతో షారూక్‌ కుటుంబం దిగులులో కూరుకుపోయింది. అతడికి త్వరగా బెయిల్‌(Bail) రావాలని తల్లి గౌరీఖాన్‌(Gauri Khan) పూజలు చేస్తూనే ఉన్నారు. అంతేనా.. ఆర్యన్‌ తిరిగొచ్చేదాకా ఇంట్లో స్వీట్లు వండొద్దని గౌరీ తన వంట సిబ్బందికి ఆర్డర్‌ వేశారట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల షారూక్‌(Shah Rukh Khan) నివాసం 'మన్నత్‌'లో మధ్యాహ్న భోజనం కోసం వంట సిద్ధం చేస్తున్న సిబ్బంది ఖీర్‌ వండారు. దీన్ని గుర్తించిన గౌరీ(Gauri Khan) వెంటనే కిచెన్‌లోకి వెళ్లి దాన్ని ఆపారు. ఆర్యన్‌ బెయిల్‌పై విడుదలై ఇంటికి వచ్చేవరకు మన్నత్‌ కిచెన్‌లో ఎలాంటి స్వీట్లు వండటానికి వీల్లేదని గౌరీ ఆదేశించినట్లు షారూక్‌ సిబ్బంది ఒకరు మీడియాకు తెలిపారు. సాధారణంగా పండగ రోజుల్లో మన్నత్‌(Mannat) వేడుకలతో కళకళలాడిపోయేది. అయితే ఇప్పుడు ఆర్యన్‌ జైల్లో ఉండటంతో షారూక్‌ కుటుంబం ఈ వేడుకలకు దూరంగా ఉంది. ఇటీవల నవరాత్రి రోజుల్లో గౌరీ తన కొడుకు కోసం నిరంతరం పూజలు చేశారని సదరు సిబ్బంది వెల్లడించారు. 


Also read: Aryan khan: 'పేదల సంక్షేమానికి కృషి చేస్తా..చెడు మార్గంలో వెళ్లను'..: ఆర్యన్‌ఖాన్‌


ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. అక్టోబరు 20న తీర్పు వెల్లడించే అవకాశాలున్నాయి. జైల్లో ఉన్న ఆర్యన్‌.. ఇటీవల షారూక్‌, గౌరీలతో కొంతసేపు వీడియో కాల్‌ మాట్లాడాడు. ఆ సమయంలో అతడు ఒకింత ఉద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు జైల్లో ఆర్యన్‌(Aryan Khan)కు అధికారులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. విడుదల అయిన తర్వాత పేదల సంక్షేమానికి కృషి చేస్తానని.. తనకు చెడ్డపేరు తెచ్చే  పనులు చేయబోనని, చెడు మార్గంలో వెళ్లనని హామీ ఇచ్చాడు.  


Also Read: Aryan Khan: ఆర్యన్‌కు రూ.4,500 మనియార్డర్ చేసిన షారుక్​ కుటుంబం..ఎందుకో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి