ఎస్ఎస్సీ సీజీఎల్ నోటిఫికేషన్ శనివారం విడుదలైంది. కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ (సీజీఎల్‌)పరీక్ష 2018కు స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా వివిధ మంత్రిత్వ శాఖ‌లు/ విభాగాల్లో గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ssc.nic.in వెబ్‌సైట్  వెళ్లి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవి దరఖాస్తు చేసుకోవచ్చు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అర్హత‌: 


  • అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులకు డిగ్రీ పూర్తిచేసి, చార్టర్డ్‌ అకౌంటెన్సీ లేదా కాస్ట్ & మేనేజ్‌మెంట్ అకౌంటెంట్స్ లేదా కంపెనీ సెక్రటరీ/ ఎంకాం/ ఎంబీఏ(ఫైనాన్స్‌)/ మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎక‌నామిక్స్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

  • జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు 60% ఉత్తీర్ణతతో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి, 10+2లో మేథమేటిక్స్‌ సబ్జెక్టుగా చదివి ఉండాలి. లేదా గ్రాడ్యుయేషన్‌లో స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా చదివిన అభ్యర్థులు కూడా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

  • మిగిలిన అన్ని పోస్టులకూ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.


పరీక్ష కేంద్రాలు:


  • ఆంధ్రప్రదేశ్‌: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ. 

  • తెలంగాణ: హైదరాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌ 

  • ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక నాలుగు అంచెలుగా జరుగుతుంది. నాలుగో అంచె (టయర్‌-4) కొన్ని పోస్టులకు మాత్రమే. అభ్యర్థులందరూ మూడు అంచెల విధానాన్ని పాటించాల్సిందే. 


ముఖ్యమైన తేదీలు:


  • దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 04.06.2018

  • టైర్-1 కంప్యూటర్‌ రాతపరీక్ష: 25.07.2018 నుంచి 20.08.2018

  • టైర్-2 పరీక్ష: 27.11.2018 నుంచి 30.11.2018