Bandra stampede: బాంద్రా రైల్వేస్టేషన్లో భారీ తొక్కిసలాట.. దీపావళి వేళ కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. వీడియో వైరల్..
stampede at bandra railway station: బాంద్రాలోని రైల్వేస్టేషన్ లో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో ప్రయాణికులు వందల మంది ఒకరి మీద మరోకరు పడిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Stampede at bandra mumbai railway station video viral: దేశమంతట దీపావళి పండుగ సందడి ప్రారంభమైంది. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్లిన కూడా.. పండగ పూట మాత్రం చాలా మంది సొంతూర్లకు వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో కొంత మంది రైళ్లు, విమానాలు, బస్సులలో తమ సొంతూర్లకు వెళ్తుంటారు. మరికొందరు సొంత వాహానాలలోకూడా ఇంటికి వెళ్లేందుకు ప్లాన్ లు చేసుకుంటారు. అయితే.. దీంతో ఆయా మార్గాలన్ని ప్రయాణికులతో రద్దీగా మారాయి.
ఇదిలా ఉండగా.. దీపావళిని కొన్ని రాష్ట్రాలు ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటాయి. ముఖ్యంగా నార్త్ వాళ్లు ఎక్కడున్న కూడా పండగ పూట మళ్లీ తమ గ్రామాలకు వెళ్లిపోతుంటారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ముంబైలోకి బాంద్రా రైల్వే స్టేషన్ లో చాలామంది ప్రయాణికులు తమ గ్రామాలకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు వచ్చారు . అక్కడ బాగా రద్దీగా ఉంది. అయితే.. బాంద్రా నుంచి యూపీలోకి గోరఖ్ పూర్ కు వెళ్లే ట్రైన్ ప్లాన్ ఫామ్ 1 మీదకు వచ్చింది.
దీంతో ఆ ట్రైన్ ను ఎక్కేందుకు వందలాదిగా ప్రయాణికులు పోటీ పడ్డారు. దీంతో ఒక్కసారిగా అందరు కింద పడిపోయారు. భారీ తొక్కిసలాట సంభవించింది. అంతే కాకుండా.. ఒకరిమీద ఒకరు ఎక్కి మరీ ట్రైన్ లో దూరేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తొంది.దీంతో ఈ ఘటనలో 10 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తొంది. చాలా మంది కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తొంది.
Read more: Viral Video: ఓర్నీ.. ఇదేం ఛెండాలం..?.. పబ్లిక్‌గా మహిళ పెదాలను ముద్దాడిన పోలీసు.. వీడియో వైరల్..
వెంటనే రైల్వే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తొంది. ఈ తొక్కిసలాటకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాధితులు కాపాడండి.. అంటూ వేడుకుంటున్న ఘటనలు కన్పిస్తున్నాయి. మొత్తానికి ఈ ఘటన మాత్రం దీపావళి వేళ పలు కుటుంబాలలో విషాదంను నింపిందని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.