SBI Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, ఎస్బీఐలో 14 వేల ఉద్యోగాల భర్తీ
SBI Jobs: ప్రభుత్వ ఉద్యోగాలకై ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరగనుంది. దేశవ్యాప్తంగా 15 వేల ఖాళీల భర్తీకై నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SBI Jobs: నిరుద్యోగులకు శుభవార్త, భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కొలువుదీరనున్నాయి. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్ పోస్టుల భర్తీకై నోటీఫికేషన్ విడుదలైంది. ఎస్బీఐ విడుదల చేసిన భారీ నోటిఫికేషన్ ఇది. ఏకంగా 14,344 ఖాళీల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలి, అర్హత వివరాలేంటనేది తెలుసుకుందాం.
దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐలో క్లర్క్ పోస్టుల భర్తీకు నోటిఫికేషన్ జారీ అయింది. దేశవ్యాప్తంగా మొత్తం 13,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ కాగా ఆ తరువాత 609 బ్యాక్‌లాగ్ పోస్టుల్ని కలిపారు. దాంతో మొత్తం 14,344 జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హత, పరీక్షా విధానం ఇతర వివరాలు https://sbi.co.in/లో చెక్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ కూడా ఇదే వెబ్‌సైట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 14,344 పోస్టులు దేశవ్యాప్తంగా ఉండగా ఇందులో 342 పోస్టులు తెలంగాణలో ఉంటే, 50 ఏపీలో ఉన్నాయి. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయస్సు 20-28 ఏళ్లలోపుండాలి. అప్లై చేసేందుకు చివరి తేదీ జనవరి 7. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఫీజు లేదు. మిగిలిన అభ్యర్ధులు 750 రూపాయలు చెల్లించాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ విధానంలో పరీక్ష జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరిలోనూ, మెయిన్స్ పరీక్ష మార్చ్, ఏప్రిల్ నెలల్లో ఉంటుంది.
ఓ వైపు భారీగా క్లరికల్ పోస్టుల్ని భర్తీ చేయనున్న ఎస్బీఐ పీవో ఉద్యోగాలకు సైతం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్బీఐ పీవో పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 27న ప్రారంభమైంది. జనవరి 16 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ ప్రోబిషనరీ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిలిమ్స్ పరీక్షలు మార్చ్ 8 నుంచి మార్చ్ 15 వరకు జరగనున్నాయి. ఇక మెయిన్స్ పరీక్షలయితే ఏప్రిల్ లేదా మే నెలల్లో జరగనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.