Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తూ ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనమైంది. అదే సమయంలో విరాళాల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాల్సిందిగా ఎస్బీఐకు ఆదేశించింది. డేటా సమర్పించేందుకు మరింత గడువు కోరుతూ బాండ్లు జారీ చేసే ఎస్బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించి భంగపడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటి వరకూ ఇచ్చిన 26 రోజుల సమయం సరిపోలేదా, ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చ్ 12లోగా విరాళాల డేటాను ఎన్నికల సంఘానికి సమర్పించాల్సిందేనని తేల్చిచెప్పింది. ఎస్బీఐ తీరుపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సమాచారం అందుబాటులో ఉన్నా ఎన్నికల సంఘానికి సమర్పించకపోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. దాంతో చేసేదిలేక ఎన్నికల బాండ్ల వివరాలను మార్చ్ 12వ తేదీ సాయంత్రానికి ఎన్నికల సంఘానికి సమర్పించింది. 


రాజకీయ పార్టీలకు విరాళాలు సమకూర్చే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల బాండ్లను 2018లో తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి వరకూ 30 దశల్లో దాదాపు 28 వేల బాండ్లను ఎస్బీఐ విక్రయించింది. ఎస్బీఐ విక్రయించిన బాండ్ల విలువ 16 వేల 518 కోట్లుగా ఉంది. ఎన్నికల బాండ్లకు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటీషన్లపై సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఎన్నికల బాండ్లు చట్టవిరుద్ధమైనవేనంటూ తీర్పు ఇస్తూ వాటిని రద్దు చేసింది. 


అయితే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాత్రం విరాళాల వివరాలు వెల్లడించడాన్ని తప్పుబడుతోంది. దీనివల్ల విరాళాలు ఇచ్చిన వ్యక్తులు వేధింపులకు గురయ్యే అవకాశముందని, ఈ అంశాన్ని పరిశీలించాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాసింది. 


Also read: CAA Protest: సీఏఏ అమలుపై ప్రతిపక్షాల అభ్యంతరం, ఎంఐఎం నేత అసదుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook