Stealth Omicron: ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఈ ఏడాది ఆరంభంతో పోలిస్తే భారీగా తగ్గింది. రోజువారి కేసులు 2 వేల లోపే నమోదవుతున్నాయి. అయితే చైనా, దక్షిణ కొరియాలో మాత్రం మళ్లీ మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా 'స్టెల్త్ ఒమిక్రాన్​' వేరియంట్​ రూపంలో ఆయా దేశాలపై కొవిడ్​ మహమ్మారి విరుచుకుకుపడుతోంది. దీనితో దేశంలో మళ్లీ ఫోర్ట్​ వేవ్​ భయాలు మొదలయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణాఫ్రికాలో బయటపడిన 'ఒమిక్రాన్' వేరియంట్​ కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో దేశంలో కరోనా మూడో దశ విజృంభించిన విషయం తెలిసింది. కాగా ఇప్పుడు మళ్లీ చైనాలో 'స్టెల్త్ ఒమిక్రాన్​' నాల్గో వేవ్​ రావచ్చన్న అంచనాలను పెంచుతోంది.


ఆరోగ్య నిపుణులు కూడా 'స్టెల్త్ ఒమిక్రాన్​' వల్ల దేశంలో కొవిడ్ నాల్గో దశ రావచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దీనితో పాటు స్టెల్త్ ఒమక్రాన్​ లక్షణాలను ఏమిటి? ఇంతకీ ఈ వేరియంట్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే దానిపై కీలక విషయాలను వెల్లడించారు. ఆ వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.


ఏమిటి ఈ స్టెల్త్ ఒమిక్రాన్​?


గత ఏడాది దక్షిణాఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్​ వేరియంట్​కు ఇది సబ్​ వేరియంట్​. ఇతర వేరియంట్లతో పోలిస్తే.. ఒమిక్రాన్​కు వేగంగా వ్యాప్తి చెందుతుందనే విషయం తెలిసిందే. ఈ వేరియంట్ కారకణంగానే మన దేశంలో కరోనా మూడో దశ కూడా వచ్చింది. స్టెల్త్ ఒమిక్రాన్​ను శాస్త్రీయంగా BA.2 ఒమిక్రాన్​ వేరియంట్​గా పిలుస్తారు. డెన్మార్క్​కు చెందిన స్టెటన్స్​ సీరమ్​ ఇన్స్​టిటూట్ (ఎస్​ఎస్​ఐ) ప్రకారం.. ఒమిక్రాన్​తో పోలిస్తే స్టెల్త్ ఒమిక్రాన్​కు​ 1.5 రేట్లు వేగంగా వ్యాప్తిచెందే సామర్థ్యం ఉందని తెలిసింది.


స్టెల్త్​ ఒమిక్రాన్​ లక్షణాలు..


డబ్ల్యూహెచ్​ఓ ప్రకారం.. ఒమిక్రాన్​లానే స్టెల్త్ ఒమిక్రాన్​ కూడా మానవుల్లో శ్వాసకోస వ్యవస్థ పై భాగంపై అధికంగా ప్రభావం చూపుతుందని తెలిసింది. దీని కారణంగా ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయని వెల్లడైంది. అయితే స్టెల్త్ ఒమిక్రాన్​ వల్ల రుచి, వాసన కోల్పోవడం వంటి సమస్యలు రావని తేలింది.


ఇతర లక్షణాలు..


జ్వరం, తీవ్ర అలసట, దగ్గు, గొంతు మంట, తలనొప్పి, కండరాల అలసట, గుండే వేగం పెరగటం వంటి సమస్యలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.


ఒమిక్రాన్​ స్టెల్త్ ఒమిక్రాన్ మధ్య తేడా..


నిపుణుల ప్రకారం.. ఒమిక్రాన్​ కంటే స్టెల్త్ ఒమిక్రాన్​ను ఆర్​టీ-పీసీఆర్ పరీక్షలో గుర్తించడం కాస్త కఠినతరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ వేరియంట్​ను గుర్తించేందుకు మరింత అడ్వాన్స్​ పరీక్షలు అవసరమని చెబుతున్నారు.


Also read: Bhagwant Mann: పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం... కొత్త మంత్రులకు షాకింగ్ న్యూస్..


Also read: Karnataka Hijab Row: హిజాబ్‌పై తీర్పు వెలువరించిన జడ్జిలకు 'వై' కేటగిరీ భద్రత..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook