Sudha Murty Oath: సుధామూర్తికి ప్రత్యేక గౌరవం.. ఎట్టకేలకు రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం
Rajya Sabha: ప్రముఖ విద్యావేత్త, రచయిత సుధామూర్తికి రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. చైర్మన్ ఆమెతో ప్రమాణం చేయించగా ఆమె భర్త నారాయణమూర్తి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
Sudha Murty: ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి అధికారికంగా రాజ్యసభ సభ్యురాలు అయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను రాజ్యసభకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు విదేశాల్లో ఉన్న ఆమె ఇటీవల తిరిగి స్వదేశం వచ్చారు. గురువారం రాజ్యసభ సభ్యురాలుగా సుధామూర్తి ప్రమాణస్వీకారం చేశారు.
Also Read: విద్యావేత్త సుధామూర్తికి మహిళా దినోత్సవ 'కానుక'.. రాజ్యసభకు నామినేట్
దేశ రాజధాని న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ చైర్మన్ చాంబర్‌లో ఈ ప్రమాణం జరిగింది. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ సుధామూర్తితో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, సుధామూర్తి భర్త నారాయణమూర్తి ఉన్నారు. ప్రమాణంచేసిన అనంతరం సుధా మీడియాతో మాట్లాడారు. 'చాలా సంతోషం. దీంతోపాటు నాపై చాలా బాధ్యత పెరిగిందని భావిస్తున్నా. నా శక్తిమేర పనిచేస్తా. పేదల కోసం పనిచేయడానికి బాధ్యతాయుత పదవి లభించింది' అని తెలిపారు. అయితే రాజకీయాల్లోకి వస్తున్నారా? అని ప్రశ్నించగా స్పందించలేదు.
Also Read: River Metro: దేశంలోనే తొలిసారిగా జలమార్గంలో మెట్రో రైలు.. నదిలో రైలు విశేషాలు ఇలా
రాజ్యసభకు తనను ఎంపిక చేసిన రోజు సుధామూర్తి చాలా సంతోషం వ్యక్తం చేశారు. 'మహిళా దినోత్సవం రోజున రాజ్యసభకు నామినేట్ చేశారనే ప్రకటన రావడం డబుల్ సర్‌ప్రైజ్. చాలా ఆనందంగా ఉంది. ప్రధానికి కృతజ్ఞతలు చెబుతున్నా. వాస్తవానికి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఏనాడూ పదవులు కోరలేదు. ప్రభుత్వం నన్ను ఎందుకు ఎంపిక చేసిందో తెలియదు. దేశానికి సేవ చేసేందుకు ఇది కొత్త బాధ్యతగా భావిస్తున్నా' అని ఆమె గతంలో చెప్పారు.
సుధామూర్తి ప్రస్థానం
కర్ణాటకలోని షిగ్గామ్ ప్రాంతంలో జన్మించిన సుధామూర్తి ప్రస్తుత వయసు 73 ఏళ్లు. ఇంజనీరింగ్ చదివిన ఆమె కంప్యూటర్ సైంటిస్ట్‌గా రాణించారు. గ్రామీణాభివృద్ధికి, విద్యా వ్యాప్తికి ఆమె కృషి చేస్తున్నారు. ఇంజనీర్‌గా పని చేసిన ఆమె కొన్నాళ్లకు సేవా కార్యక్రమాలకు పూర్తి సమయం కేటాయించారు. ప్రస్తుతం ఆమె రచయిత్రిగా, విద్యావేత్తగా రాణిస్తున్నారు. పిల్లల కోసం ఆమె ఎన్నో పుస్తకాలు రచించారు. కన్నడ, ఆంగ్ల సాహిత్యానికి చేసిన కృషికి గాను సాహిత్య అకాడమీ 'బాల సాహిత్య' అవార్డును కూడా ప్రకటించింది. కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్, గ్రంథాలయ వసతులు కల్పించారు. ఆమె సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2006లో పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ పురస్కారాలను ప్రకటించింది. నారాయణమూర్తి, సుధ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కుమార్తె భర్త రిషి సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి