Covid Third Wave: దేశమంతా  ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ ధాటికి గజగడలాడుతుంటే..థర్డ్ వేవ్ హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. సెకండ్ వేవ్ పరిస్థితులపై విచారణ చేస్తున్న సుప్రీంకోర్టు...థర్డ్ వేవ్‌పై కేంద్రాన్ని ప్రశ్నించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రతిరోజూ 3.5 లక్షలకు పైనే కేసులు నమోదవుతున్నాయి. మధ్యలో రెండు మూడుసార్లు 4 లక్షల మార్క్ కూడా దాటింది. గత 24 గంటల్లో 4 లక్షల 12 వేల కేసులు వెలుగు చూశాయి. 3 లక్షల 29 వేల మంది కోలుకున్నారు. అయితే దేశవ్యాప్తంగా కరోనా (Coronavirus) కారణంగా 3 వేల 980 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో ఇప్పటి వరకూ 16.25 కోట్ల మంది వ్యాక్సిన్ ( Vaccination) వేయించుకున్నారు. 


ఈ తరుణంలో కరోనా థర్డ్ వేవ్ ( Corona Third Wave) తప్పదని అత్యున్నత శాస్త్రీయ సలహాదారుడు డాక్టర్ కే విజయ రాఘవన్ సంచలన ప్రకట చేశారు. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులపై ఇప్పటికే విచారణ చేస్తున్న సుప్రీంకోర్టు (Supreme Court) ఈ వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో థర్డ్ వేవ్‌ను ఎలా ఎదుర్కొంటారంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. దేశంలో థర్డ్ వేవ్ ఎప్పుడొస్తుంది..ఎలా వస్తుందనేది స్పష్టత లేదని..కానీ ముప్పు మాత్ర తప్పదని డాక్టర్ విజయ్ రాఘవన్ స్పష్టం చేశారు. థర్డ్ వేవ్ నాటికి వైరస్ మరింతగా మారవచ్చని..భవిష్యత్‌‌లో మరిన్ని వేవ్‌‌లు రావచ్చని చెప్పారు. ప్రస్తుతం ఉన్న వేరియంట్లపై వ్యాక్సిన్ బాగా పనిచేస్తుందని తెలిపింది. 


Also read: Corona Third Wave: కరోనా థర్డ్ వేవ్ తప్పదు, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న నిపుణులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook