Judiciary System: దేశ న్యాయ వ్యవస్థపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థ పరిరక్షణ, స్వతంత్రత, సమగ్రతలపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ న్యాయ వ్యవస్థను పరిరక్షించుకోవల్సిన అవసరముందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ(Justice nv ramana)చెప్పారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత, సమగ్రతల పరిరక్షణ, ప్రచారం అత్యంత ముఖ్యమని వ్యాఖ్యానించారు. ట్రయల్‌ కోర్టు, జిల్లా కోర్టుల పని తీరుపైనే భారత న్యాయ వ్యవస్థ ఔన్నత్యం ఆధారపడి ఉందని, ఆ కోర్టులు ఇచ్చే తీర్పుల ద్వారా లక్షలాది మందికి ఈ విషయం తెలుస్తుందని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో చట్టపరమైన అవగాహన, ప్రచార కార్యక్రమంలో జస్టిస్‌ ఎన్‌‌వి రమణ ప్రసంగించారు. 


రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన కోర్టులు ఇచ్చే తీర్పులు సమాజంపై అత్యధిక ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పారు. సంక్షేమ రాజ్యాన్ని తీర్చిదిద్దడంలో న్యాయ వ్యవస్థ పాత్ర  చాలా కీలకమైందని..జస్టిస్ ఎన్‌వి రమణ తెలిపారు. ట్రయల్‌ కోర్టు, జిల్లా కోర్టుల పనితీరును ఆధారంగా చేసుకొని భారత న్యాయవ్యవస్థపై లక్షలాది మంది అంచనాలు ఉంటాయన్నారు. క్షేత్రస్థాయిలో కోర్టులు బలోపేతమైతేనే ఆరోగ్యకరమైన న్యాయ వ్యవస్థ ఏర్పాటవుతుంది. అందుకే న్యాయ వ్యవస్థ స్వతంత్రం, సమగ్రతలను కాపాడుకోవడానికి మించి దేనికి ప్రాధాన్యం లేదని స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులను ఉద్దేశించి తొలిసారిగా ముఖాముఖి మాట్లాడిన జస్టిస్‌ ఎన్‌‌వి రమణ.. రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతల్ని చిత్తశుద్ధి, అంకితభావంతో నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే ప్రజల్లో న్యాయ వ్యవస్థపై (Supreme Court)విశ్వాసం పెరుగుతుందని చెప్పారు. దిగువ కోర్టులు ఇచ్చిన తీర్పులు సామాజికంగా ఎంతో ప్రభావాన్ని చూపిస్తున్నందున..ఆ తీర్పులు అందరికీ అర్థమయ్యేలా సులభమైన భాషలో స్పష్టంగా ఉండాలి.


Also read: S400 Missiles: ఇండియాకు ఎస్ 400 క్షిపణుల సరఫరా ప్రారంభం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe