Supreme Court: సుప్రీంకోర్టుకు శీతాకాల సెలవులు, రేపట్నించి పనిచేయని అత్యున్నత న్యాయస్థానం
Supreme Court: సుప్రీంకోర్టుకు శీతాకాల సెలవులు ఇచ్చేశారు. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇవాళ ఈ విషయమై కీలక ప్రకటన చేశారు. సెలవుల సమయంలో ఏ విధమైన బెంచ్‌లు పని చేయవన్నారు.
దేశ అత్యున్నత న్యాయస్థానం రేపటి నుంచి కొత్త సంవత్సరం వరకూ పనిచేయదని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డి వై చంద్రచూడ్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టుకు 17 రోజులపాటు శీతాకాల సెలవులు ప్రకటించారు. ఆ వివరాలు మీ కోసం..
దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చలికాలం సెలవులు ప్రకటించారు. డిసెంబర్ 17 నుంచి జనవరి 1 వరకూ సెలవులు ఇస్తున్నట్టు సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రకటించారు. సెలవుల సమయంలో సుప్రీంకోర్టులో ఏ విధమైన బెంచ్‌లు అందుబాటులో ఉండవన్నారు. ప్రతియేటా శీతాకాల సెలవుల్లో వెకేషన్ బెంచ్‌లు ఏర్పాటయ్యేవి కానీ ఈసారి ఏ బెంచ్‌లు అందుబాటులో ఉండవని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. 2023 జనవరి 2న తిరిగి సుప్రీంకోర్టు సేవలు ప్రారంభమౌతాయి.
కోర్టుల సెలవులపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో వ్యాఖ్యలు చేసిన తరువాతి రోజే సుప్రీంకోర్టు సీజేఐ సెలవులు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. న్యాయస్థానాలకు సుదీర్ఘ సెలవులతో న్యాయం కోరేవారు అసౌకర్యానికి గురవుతున్నారనే భావన ప్రజల్లో ఉందని మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. న్యాయస్థానాలకు సెలవుల అంశమనేది గతంలో కూడా చాలాసార్లు చర్చనీయాంశమైంది. మాజీ సీజేఐ జస్టిస్ ఎన్‌వి రమణ సైతం స్పందించారు. న్యాయమూర్తులు ఉదయం 10 గంటల్నించి సాయంత్రం 4 గంటలవరకూ పనిచేస్తూ..సుదీర్ఘ సెలవులతో సౌకర్యంగా జీవిస్తున్నారనే అపోహ ప్రజల్లో ఉందని గతంలో జస్టిస్ ఎన్‌వి రమణ చెప్పారు. అయితే ఇది నిజం కాదని..తీర్పుల గురించి ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతామని, కేసుల అధ్యయనం నిమిత్తం వీకెండ్స్, హాలిడేస్‌లో కూడా పనిచేసిన సందర్భాలున్నాయన్నారు.
ఏదేమైనా సరే..సుప్రీంకోర్టు సెలవుల విషయంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి వ్యాఖ్యలు చేసిన తరువాతి రోజు కోర్టుకు సెలవులు ప్రకటించడం చర్చనీయాంశమౌతోంది.
Also read: Bird Flu Virus: కేరళలో బర్డ్ ఫ్లూ పంజా.. కోళ్లు, బాతులను చంపేయండి.. ప్రభుత్వం ఆదేశాలు జారీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook