High Court Judges Transfer: హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకై కొలీజియం సిఫారసు, జాబితాపై తెలంగాణ, మద్రాస్ అభ్యంతరాలు బేఖాతరు, గుజరాత్‌కు ఆమోదం
High Court Judges Transfer: భారతదేశంలో ఏడు హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ కానున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు సిఫారసు చేసింది. ఈ జాబితాపై గుజరాత్ అడ్వకేట్ల అభ్యర్ధనను మన్నించిన సుప్రీం కొలీజియం..మద్రాస్, తెలంగాణ అభ్యంతరాల్ని విస్మరించింది.
సుప్రీంకోర్టు కొలీజియం ఇవాళ దేశంలోని ఏడు హైకోర్టు న్యాయమూర్తుల్ని బదిలీ చేయాలని సిఫారసు చేసింది. ఈ జాబితాలో పేర్లపై వ్యక్తమైన పలు అభ్యంతరాల్ని పరిగణలో తీసుకునే విషయమై కొలీజియం అనుసరించిన వైఖరిపై ప్రశ్నలు వస్తున్నాయి. గుజరాత్‌కో న్యాయం, మాకో న్యాయమా అనే వాదన విన్పిస్తోంది.
సుప్రీంకోర్టు కొలీజియం సమావేశం ఇవాళ అంటే నవంబర్ 24న జరిగింది. ఈ సమావేశంలో దేశంలోని ఏడు హైకోర్టు న్యాయూర్తుల బదిలీకై నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తుల జాబితాలో ఎవరిని ఎక్కడికి బదిలీ అనేది సూచిస్తూ..కేంద్రానికి సిఫారసు చేసింది.
బదిలీకై సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన న్యాయమూర్తులు
1. జస్టిస్ వీఎం వేలుమణిని మద్రాస్ హైకోర్టు నుంచి కోల్‌కతా హైకోర్టు
2. జస్టిస్ బట్టు దేవానంద్‌ను ఏపీ హైకోర్టు నుంచి మద్రాస్ హైకోర్టు
3. జస్టిస్ డి రమేశ్‌ను ఏపీ హైకోర్టు నుంచి అల్లహాబాద్ హైకోర్టు
4. జస్టిస్ లలిత కన్నెగంటిని తెలంగాణ హైకోర్టు నుంచి కర్ణాటక హైకోర్టు
5. జస్టిస్ డి నాగార్జున్‌ను తెలంగాణ హైకోర్టు నుంచి మద్రాస్ హైకోర్టు
6. జస్టిస్ టి రాజాను మద్రాస్ హైకోర్టు నుంచి రాజస్థాన్ హైకోర్టు
7. జస్టిస్ ఎ అభిషేక్ రెడ్డిని తెలంగాణ హైకోర్టు నుంచి పాట్నా హైకోర్టు
గుజరాత్, తెలంగాణ, మద్రాస్ అభ్యంతరాలు
గుజరాత్ హైకోర్టుకు చెందిన జస్టిస్ నిఖిల్ ఎస్ కారియల్ పేరును కూడా ప్రతిపాదించినా..గుజరాత్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొలీజియం జాబితాలో రాలేదు. అదే సమయంలో సుప్రీంకోర్టు కొలీజియం జాబితాలో ఉన్న జస్టిస్ ఎ అభిషేక్ రెడ్డిని బదిలీ చేయడంపై తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ వ్యతిరేకించినా..కొలీజియం జాబితాలో మార్పు రాలేదు. అదే విధంగా జస్టిస్ టి రాజాను రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని మద్రాస్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసినా మారలేదు.
అంటే కేవలం గుజరాత్ అడ్వకేట్స్ అసోసియేషన్ అభ్యంతరాల్ని మాత్రమే సుప్రీంకోర్టు కొలీజియం పరిగణలో తీసుకుని..తెలంగాణ, మద్రాస్ హైకోర్టు న్యాయవాదుల అసోసియేషన్ అభ్యంతరాల్ని ఎందుకు పట్టించుకోలేదనే వాదన విన్పిస్తోంది.
Also read: Agni 3 Missile: రక్షణశాఖ అమ్ములపొదిలో మరో అస్త్రం, విజయవంతమైన అగ్ని 3 ప్రయోగం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook