Manipur Violence: మొత్తం దేశాన్నే కాకుండా ప్రపంచాన్ని కుదిపేసిన ఘటన అది. ఇద్దరు మహిళల్ని వివస్త్రల్ని చేసి ఊరేగించడమే కాకుండా ఆ మహిళల ప్రైవేట్ పార్ట్స్‌తో ఆడుకుంటూ పైశాచిక ఆనందం పొందిన పాశవికుల గుంపు. మూడు నెలలు ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వీడియో దేశాన్ని ఒక్కసారిగా షేర్ చేసింది. మణిపూర్ ఘటన, హింసపై గతంలో హెచ్చరించిన సుప్రీంకోర్టు ఈసారి చర్యలకు ఉపక్రమించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మణిుపూర్‌లో మొయితెయ్, నాగా, కుకీల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది.. ప్రభుత్వం చోద్యం చూస్తుండటంతో ఊరంతా తగలబడిపోతోంది. వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకోగా వేలాది ఇళ్లు దగ్దమయ్యాయి. అన్నింటికీ మించి స్త్రీలపై అత్యంత దారుణంగా అత్యాచారాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఇద్దరు మహిళల్ని పూర్తిగా వివస్త్రల్ని చేసి ఊరంతా ఊరేగించిన వేయిమంది గుంపు. మధ్యమధ్యలో ఆ మహిళల శరీర భాగాలతో ఆడుకుంటూ పైశాచిక ఆనందం పొందుతూ అత్యంత పాశవికంగా వ్యవహరించిన తీరు. మణిపూర్ తగలబడిపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూడటంతో గతంలో ఓసారి సుప్రీంకోర్టు హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్వయంగా మణిఫూర్ పై మాట్లాడారు. మీరు కలగజేసుకుంటారా లేక మేం కలగజేసుకోవాలా అని హెచ్చరించారు. 


అయినా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. దాంతో ఈసారి చర్యలకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వీడియో బయటకు వచ్చేంతవరకూ ఏం చేస్తున్నారని కేంద్రానికి సూటి ప్రశ్నలు వేసింది. ఈ అంశంపై బాధిత మహిళల తరపున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. మే 3న అల్లర్లు జరిగితే ఇప్పటి వరకూ ఎన్ని ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో బాధిత మహిళలు సీబీఐ విచారణను చేయవద్దంటున్నారని, మరో కోర్టుకూ కేసు బదిలీ చేయవద్దంటున్నారని కపిల్ సిబల్ తెలిపారు. 


మరోవైపు ఈ ఘటనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తుకై రిటైర్డ్ మహిళా న్యాయమూర్తులు, నిపుణులతో సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు  ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. సిట్ సభ్యులు ఆ రాష్ట్రంలో పర్యటించి బాధితులతో మాట్లాడతారని సుప్రీంకోర్టు తెలిపింది. అదే సమయంలో మణిపూర్‌లో జరుగుతున్నది జాతి హింస కాదని, మయన్మార్ నుంచి జరుగుతున్న డ్రగ్స్ అక్రమ రవాణా వ్యవహారమని మొయితెయ్ కమ్యూనిటీ వేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వాస్తవాలతో పిటీషన్ దాఖలు చేయాలని సూచించింది. 


Also read: Stock Market Analysis for Beginners: కొత్తగా పెట్టుబడి పెట్టే వారికి స్టాక్ మార్కెట్ ఎనాలసిస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook