Supreme Court on SBI: రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే ఎన్నికల బాండ్లను ఇటీవల ఫిబ్రవరి 15న నిషేధిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ తరువాత  వివిధ పార్టీలకు విరాళాలిచ్చిన దాతల వివరాలు, రద్దు చేసిన సమాచారాన్ని మార్చ్ 12లోగా సమర్పించాలంటూ డెడ్‌లైన్ విధించింది. అయితే ఈ డెడ్‌లైన్ పొడిగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఎస్బీఐ పిటీషన్ దాఖలు చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫిబ్రవరి 15వ తేదీన సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పు దేశంలోని రాజకీయ పార్టీలకు శరాఘాతంగా తగిలింది. గుట్టు చప్పుడు కాకుండా దాతల నుంచి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు సేకరిస్తూ వచ్చిన పార్టీలకు ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లోని అధికార పార్టీలు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్లను నిషేదించడమే కాకుండా ఎవరి డబ్బులు వారికి తిరిగిచ్చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను మార్చ్ 6వ తేదీలోగా ఎన్నికల సంఘానికి, మార్చ్ 13లోగా ఎన్నికల సంఘం వెబ్‌సైట్ బహిరంగపర్చాలని ఆదేశించింది. 


అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చివరి వరకూ కాలయాపన చేసి చివర్లో గడువు జూన్  30 వరకూ పొడిగించాలని పిటీషన్ దాఖలు చేసింది. ఇంత తక్కువ సమయం సరిపోదని వ్యాఖ్యానించింది. మరోవైపు మార్చ్ 6వ తేదీలోగా ఈసీకు వివరాలు సమర్పించకపోవడంతో సుప్రీంకోర్టు తీర్పును ఉద్దేశ్యపూర్వకంగా ఎస్బీఐ ఉల్లంఘించిందని మరో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎస్బీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గడువు పొడిగించాలన్న ఎస్బీఐ పిటీషన్ కొట్టివేస్తూ మార్చ్ 12వతేదీ బ్యాంకు పని దినాలు ముగిసేలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలు సమర్పించాలని ఆదేశించింది. 


ఫిబ్రవరి 15న ఇచ్చిన తీర్పులో విరాళాల వివరాలు అందించాలని స్పష్టంగా ఆదేశించినా..ఇలా అదనపు సమయం కోరడం తీవ్రంగా గర్హించే విషయమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గత 26 రోజుల్నింంచి ఏం చేస్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారనే సమాచారం పిటీషన్‌లో లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఇచ్చిన గడువు ప్రకారం సీల్డ్ కవర్ తెరిచి ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సిందేని తేల్చిచెప్పింది. 


Also read: Chungreng Koren: 'మణిపూర్‌ మంటల్లో కాలుతుంది మోదీజీ ఒక్కసారి రండి' కన్నీళ్లతో చాంపియన్‌ విజ్ఞప్తి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter