Supreme Court: ప్రపంచ విఖ్యాత పూరీ జగన్నాథ్ యాత్రకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. కరోనా సంక్షోభం నేపధ్యంలో పూరీ జగన్నాధ్ యాత్ర వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒడిశాలోని పూరీ జగన్నాథ్ రథయాత్ర (Puri Jagannadh Rathyatra) అంటే తెలియిని వారుండరు. ప్రతియేటా అత్యంత ఘనంగా జరిగే ఉత్సవమిది. కరోనా సంక్షోభం కారణంగా పూరీ జగన్నాథ్ రథయాత్రపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రపంచ విఖ్యాత జగన్నాథ యాత్రకు పూరీలో మాత్రమే నిర్వహించేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో నిర్వహించేందుకు అనుమతి నిరాకరించింది. పూరీ మినహా మిగిలిన ప్రాంతాల్లో రథయాత్రల్ని అనుమతించేది లేదని ఒడిశా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కూడా సమర్ధించింది.


అయితే హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ సందర్భంగా ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు కూడా జగన్నాథ రథయాత్రను చూసేందుకు పూరీ వెళ్లాలనే ఉంది. కానీ మనం నిపుణులం కాదు. ఈ విషయంలో ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో ఛాన్స్ తీసుకోలేం, కావాలంటే యాత్రను టీవీలో చూడవచ్చు, వచ్చే దఫా భగవంతుడు అనుగ్రహిస్తాడని నమ్ముతున్నామంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ (Chief justice nv ramana) తెలిపారు. 


Also read: Citizenship Amendment Act:మధ్యప్రదేశ్‌లో సీఏఏ అమలు, ఆరుగురు పాక్ శరణార్ధులకు ఇండియా పౌరసత్వం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook