ప్రభుత్వోద్యోగాలు, అడ్మిషన్లపై సుప్రీంకోర్టు ( Supreme court ) కీలక  ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు విభాగాల్లో మరాఠా కోటాపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో మరాఠీయులకు ( Maratha reservations ) ప్రత్యేక రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని బోంబే హైకోర్టు సమర్ధించింది కానీ 16 శాతం రిజర్వేషన్ సరైంది ేకాదని...మరాఠీయుల కోటా ఉద్యోగాల్లో 12 శాతం, అడ్మిషన్లలో 13 శాతం మించరాదని గత ఏడాది బోంబే కోర్టు ( Bombay court ) స్పష్టం చేసింది.  అయితే సుప్రీంకోర్టు మాత్రం 2020-21 కు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలు, అడ్మిషన్లలో మరాఠీయుల కోటాపైనే స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ ఎల్ఎన్ రావు నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల సుప్రీంబెంచ్ ఈ ఆదేశాలిచ్చింది. మరాఠా కోటా చట్టబద్ధతను మాత్రం కోర్టు విస్తృత ధర్మాసనమే నిర్ణయిస్తుందని చెప్పింది. ఇప్పటికే ప్రయోజనం పొందినవారిపై ఈ ఆదేశాల ప్రబావం ఉండదని తెలిపింది. Also read: India Corona Tests: 5 కోట్ల మార్క్ దాటిన కరోనా పరీక్షలు