SC ST Classification: ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు నో చెప్పిందెవరు, ఎందుకు, ఆసలు ఆ న్యాయమూర్తి తీర్పులో ఏముంది
Justice Bela Trivedi Differs on SC ST Classification: ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన, సంచలనమైన తీర్పు వెలువరించింది. 50 ఏళ్ల వివాదానికి పరిష్కారం లభించింది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో ఒకరు తప్ప అందరూ ఓకే చెప్పారు. ఆ ఒక్కరు ఎవరు, ఏమన్నారో తెలుసుకుందాం..
Justice Bela Trivedi Differs on SC ST Classification: ఎన్నాళ్ల నుంచే అపరిష్కృతంగా వివాదంగా ఉన్న ఎస్టీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో వర్గీకరణకు ఓకే చెబుతూ 6-1 మెజారిటీతో తీర్పు వెలువడింది. వర్గీకరణ రాజ్యాంగ మౌళిక సూత్రాలకు వ్యతిరేకమని, సాధ్యం కాదని ఒకే ఒక న్యాయమూర్తి జస్టిస్ ఎం బేలా త్రివేది స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చాలా కాలంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై ఓ వివాదంగా మారిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశానికి సుప్రీంకోర్టు పచ్చ జెండా ఊపింది. వర్గీకరణను సమర్థించింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను సబ్ క్లాసిఫికేషన్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని న్యాయస్థానం తెలిపింది. ఇదే అంశంపై గతంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కోర్టు కొట్టేసింది.
అయితే ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ ఎం బేలా త్రివేది మాత్రం వర్గీకరణను వ్యతిరేకించారు. షెడ్యూల్ కులాల జాబితాలో సంస్కరణల పేరిట రిజర్వేషన్ల మౌళిక సిద్ధాంతాన్ని కదిలించడం మంచిది కాదని ఆమె చెప్పారు. షెడ్యూల్ కులాల్లో మళ్లీ ప్రత్యేకంగా గ్రూపులు తీసుకురావడం సరైన విధానం కాదన్నారు. అసలు రిజర్వేషన్లు కల్పించిందే వెనుకబడిన ఎస్సీ వర్గానికి చేయూత ఇచ్చేందుకైనప్పుడు మళ్లీ వర్గీకరణ అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇందులో కూడా ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అని వర్గీకరించడం సరైంది కాదన్నారు.
వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కు వ్యతిరేకమన్నారు. ఈ సెక్షన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో రాజకీయ ప్రమేయాన్ని నిరోధిస్తుందని చెప్పారు. షెడ్యూల్ కులాలకు ప్రత్యేక హోదా కల్పించేలా రిజర్వేషన్ వ్యవస్థ ఉందని, ఇందులో ఎలాంటి మార్పులు చేయాలన్నా రాష్ట్రపతి ద్వారానే జరగాలన్నారు. రాజకీయ కారణాల్ని దృష్టిలో ఉంచుకుని ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించలేదని చెప్పారకు. కానీ మిగిలిన ఆరుగురు సభ్యులు ఏకాభిప్రాయానికి రావడంతో 6-1 మెజారిటీతో వర్గీకరణకు ఓకే చెబుతూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
అయితే కులం, సామాజిక స్థితిగతులు, ఆర్ధిక పరిస్థితుల ఆధారంగా అందరికీ రిజర్వేషన్లు కల్పించడం కంటే ఒక కుటుంబంలో ఒక తరానికే పరిమితం చేస్తే మంచిదని మరో న్యాయమూర్తి జస్టిస్ పంకజ్ మిథాల్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండటం సరైందేనన్న మెజార్టీ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవిస్తున్నానని మరో సభ్యుడు జస్టిస్ చంద్ర శర్మ తెలిపారు.
Also read: Wayanad Destruction: వయనాడ్ విలయం తుడుచుకుపోయిన చూరల్ మల, ముందక్కై గ్రామాలు, 270 కు చేరిన మరణాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook