Supreme Court on EWS Reservation: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్డు చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. ఆర్థిక ప్రాతిపదికన సాధారణ కేటగిరీ ప్రజలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ ప్రాథమిక స్ఫూర్తికి విరుద్ధం కాదని స్ఫష్టం చేసింది. సుప్రీం కోర్టులోని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌లో ముగ్గురు న్యాయమూర్తులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. దీంతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (Economically Weaker Section)కు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొనసాగనుంది. ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం బిల్లును తీసుకువచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. 30కి పైగా పిటిషన్లు సుప్రీం కోర్టులో దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై సెప్టెంబర్ 27న విచారించిన కోర్టు.. ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. జస్టిస్ దినేష్ మహేశ్వరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కు సంబంధించిన 103వ రాజ్యాంగ సవరణను సమర్థించారు. ఇది రాజ్యాంగక ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించదని చెప్పారు. జస్టిస్ బేల ఎం త్రివేది, జస్టిస్ జెబి పార్దివాలా కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చారు.


జస్టిస్ రవీంద్ర భట్ రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. ఇది ప్రాథమిక స్ఫూర్తికి అనుగుణంగా లేదని అన్నారు. ఎస్టీ, ఎస్సీ, ఓబీసీలను రిజర్వేషన్లకు దూరంగా ఉంచడం సరికాదన్నారు. ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ కూడా ఆర్థిక ప్రాతిపదికన సాధారణ కేటగిరీ ప్రజలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. ఆర్థిక కారణాలతో ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ కమ్యూనిటీని రిజర్వేషన్లకు దూరంగా ఉంచడం వివక్షాపూరితమని అన్నారు. ఈ విషయంలో జస్టిస్ భట్ అభిప్రాయాన్ని ఆయన సమర్థించారు. అయితే 3:2 మెజారిటీతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 


ఆర్థిక ప్రాతిపదికన జనరల్ కేటగిరీ ప్రజలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు 2019 జనవరి 8న కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బిల్లుకు అనుకూలంగా 323 ఓట్లు రాగా.. 3 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. డీఎంకే, లెఫ్ట్ పార్టీల ఎంపీలు కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఈడబ్యూఎస్ బిల్లును  2019 జనవరి 10న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 165 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయగా.. ఏడుగురు 7 ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేశారు.


2019 జనవరి 31 న ఈడబ్యూఎస్ రిజర్వేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15, 16కి క్లాజ్ (6)ని జోడించి ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు ఉద్యోగాలు కల్పించింది. దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు.. ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రకటించింది.


ఫిబ్రవరి 2020లో ఐదుగురు విద్యార్థులు మధ్యప్రదేశ్ హైకోర్టులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. SC, ST, OBCలను 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నుంచి మినహాయించారని.. ఇది రాజ్యాంగం ప్రాథమిక స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. తమిళనాడు అధికార పార్టీ డీఎంకే సహా పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


అప్పటి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో సహా సీనియర్ న్యాయవాదుల వాదనలను విన్న సుప్రీంకోర్టు.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘిస్తుందా అనే చట్టపరమైన ప్రశ్నపై సెప్టెంబర్ 27న తీర్పును రిజర్వ్ చేసింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ.. విద్యావేత్త మోహన్ గోపాల్ సెప్టెంబర్ 13న బెంచ్ ముందు వాదించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం "బ్యాక్‌డోర్" రిజర్వేషన్ భావనను నాశనం చేసే ప్రయత్నమన్నారు. తాజాగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది.


Also Read: Hardik Pandya: హర్ధిక్ పాండ్యా హిట్ వికెట్.. సైలెంట్‌గా బెయిల్స్ వికెట్లపై పెట్టేశాడు.. వీడియో వైరల్  


Also Read: Sania Mirza: షోయబ్ మాలిక్‌తో సానియా మీర్జా విడాకులు..? సోషల్ మీడియాలో వైరల్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook