అయోధ్య కేసు ఫిబ్రవరి 8, 2018కు వాయిదా
వివాదాస్పద `రామమందిరం-బాబ్రీ మసీదు` అంశంపై సుప్రీంకోర్టులో తుది వాదనలు ముగిశాయి. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్ తో కూడిన ధర్మసనం కేసును పరిశీలించింది.
వివాదాస్పద 'రామమందిరం-బాబ్రీ మసీదు' అంశంపై సుప్రీంకోర్టులో తుది వాదనలు ముగిశాయి. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్ తో కూడిన ధర్మసనం కేసును పరిశీలించింది. ఈ రోజే తుదితీర్పు వెల్లడైతుందని అందరూ భావించారు. కానీ తీవ్ర ఉత్కంఠత లేపి తదుపరి విచారణను ఫిబ్రవరి 8, 2018కు వాయిదా వేసింది.
2010లో 'అయోధ్య' వివాదంపై తీర్పు వెల్లడైంది. ఈ కేసును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 13 పిటీషన్లు దాఖలు చేశారు. ఇవాళ ధర్మాసనం ఆ 13 పిటీషన్లను పరిశీలించింది. సున్నీ వక్ఫ్ బోర్డు తరుపున సీనియర్ అడ్వకెట్ కపిల్ సిబల్, యుపీ ప్రభుత్వం తరువున అడిషనల్ సోలిసట్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
గతంలో వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని అలహాబాద్ హైకోర్టు మూడు భాగాలు చేసింది. సున్నీ వక్ఫ్ బోర్డు, రామ్ లల్లా, నిర్మోహి అఖారాలకు ఆ భూమిని పంచి ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. రేపటితో బాబ్రీ మసీదు కూల్చేసి 25ఏళ్లు అవుతుంది.
తీర్పు హైలెట్స్
5 డిసెంబర్ 2017, 15:45 PM
వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 8, 2018కు వాయిదా వేసింది.
5 డిసెంబర్ 2017, 14:59 PM
అలహాబాద్ హైకోర్టు బెంచ్ ముందు దాఖలు చేసిన అన్ని పత్రాలను, అనువాద కాపీలను తగిన సమయంలో సుప్రీంకోర్టులో దాఖలు చేస్తామని పిటీషనర్లు అభ్యర్థించారు.
5 డిసెంబర్ 2017, 14:39 PM
సున్ని వక్ఫ్ బోర్డు నియమించిన కపిల్ సిబల్.. ఎఎస్జి మెహతా చెప్పే మాటలపై సందేహం వ్యక్తం చేశాడు. అంత తక్కువ సమయంలో 19,000పైగా పత్రాలను ఎలా దాఖలు చేశారని అన్నారు.
5 డిసెంబర్ 2017, 14:38 PM
అయోధ్య వివాదానికి సంబంధించిన అన్ని పత్రాలు, అనువాద కాపీలు ఇప్పటికే రికార్డులో ఉన్నాయని తుషార్ మెహతా చెప్పారు.
5 డిసెంబర్ 2017, 14:38 PM
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తరపున ఉన్న అదనపు సొలిసిటర్ జనరల్ (ఎఎస్జి) తుషార్ మెహతా.. సిబాల్ వాదనలతో ఏకీభవించలేదు.
5 డిసెంబర్ 2017, 14:37 PM
అన్ని పత్రాలు తమకు అందలేదని సిబాల్ కోర్టుకు విన్నవించారు.
5 డిసెంబర్ 2017, 14:37 PM
అలహాబాద్ హైకోర్టుకు ముందు పిటీషనర్లచే సమర్పించబడిన పత్రాలను చదువుతూ సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ సుప్రీంకోర్టులో కనిపించారు.