Supreme court: నిరుద్యోగులకు శుభవార్త. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నారు. వివిధ ప్రాంతీయ భాషల్లో ప్రావీణ్యముంటే చాలు..ఆ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేయాలి, ఉద్యోగాలేంటనే వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు( Supreme court )లో ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నారు. సుప్రీంకోర్టు ఈ మేరకు నోటిఫికేషన్ వెలువరించింది. 30 ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాల్ని(Translator jobs )భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో ప్రకటించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతీయ భాషల్లో ప్రావీణ్యముంటే ట్రాన్స్‌లేటింగ్ సామర్ధ్యముంటే దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత , ఆసక్తి కలిగిన అభ్యర్ధులు మార్చ్ 13 లోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులు కోర్టులిచ్చిన తీర్పుల్ని ఇంగ్లీషు నుంచి వివిధ ప్రాంతీయ భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేయాల్సి ఉంటుంది. 


హిందీ అనువాదానికి సంబంధించి 5, అస్సామీ, 2, బెంగాలీ, 2, తెలుగు 2, గుజరాతీ 2, ఉర్దూ 2, మరాఠీ 2, తమిళం 2, కన్నడ 2, మళయాళం 2 , మణిపురి 2, ఒడిశా 2, పంజాబీ 2, నేపాలీ 1 పోస్టులున్నాయి. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్ధులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. దీంతోపాటు ట్రాన్స్‌లేషన్‌లో సర్టిఫికేట్ లేదా డిప్లొమా కోర్సు చేసి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18-27 లోపుండాలి. ఇతర వివరాలకు నోటిఫికేషన్(Supreme court jobs notification )చూడవచ్చు. ముందుగా అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్(Supreme court website )ఓపెన్ చేసి..రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం సంబంధిత డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. తరువాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. జనరల్ కేటగరీ విద్యార్ధులకు 5 వందల రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్ధులకు 250 రూపాయలు ఫీజు ఉంటుంది. 


Also read: NHAI FAQs: ఒక వాహనం FASTagను వేరే వాహనానికి ఉపయోగించవచ్చా, కారు అమ్మితే ఏం చేయాలి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook