Delhi Liquor Scam: దేశాన్ని కుదిపేయడమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. బెయిల్ పిటీషన్‌ను మరోసారి తిరస్కరించడమే కాకుండా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఆప్ నేత, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కీలకమైన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఈడీలు ఆయనపై పలు ఛార్జిషీట్లు దాఖలు చేశాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 26న అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా అప్పట్నించి జైలులోనే ఉన్నారు. ఈ కేసులో మనీష్ సిసోడియాపై మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా తీవ్రంగా ఉన్నాయి. ఈ కేసులో బెయిల్ కోరుతూ మనీష్ సిసోడియా ఇంతకుముందు ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా కోర్టు కొట్టివేసింది. దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


మనీష్ సిసోడియా బెయిల్ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో పలు దశల్లో వాదనలు జరిగాయి. ఆ తరువాత తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టిల ధర్మాసనం ఇవాళ తీర్పు వెల్లడించింది. ఈకేసులో 338 కోట్లు చేతులు మారాయనేందుకు ఆధారాలున్నాయని అభిప్రాయపడిన ధర్మాసనం దర్యాప్తు సంస్థల వాదనలతో ఏకీభవించింది. ఫలితంగా మనీష్ సిసోడియా బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించింది. అయితే మనీష్ సిసోడియాపై విచారణను 6-8 నెలల్లో పూర్తి చేయాలంటూ డెడ్‌లైన్ విధించింది సుప్రీంకోర్టు. విచారణ ప్రక్రియ మందకొడిగా సాగితే మరోసారి బెయిల్ పిటీషన్ దాఖలు చేసుకోవచ్చు. విచారణ ఆలస్యం చేస్తూ నిరవధికంగా జైలులో ఉంచడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది కోర్టు. 


మనీష్ సిసోడియా బెయిల్ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో వాదనల అనంతరం అక్టోబర్ 17న తీర్పు రిజర్వ్ అయింది. 8 నెలలుగా జైలులో ఉన్న మనీష్ సిసోడియా బెయిల్ వస్తుందని ఎదురుచూసినా చివరికి నిరాశ తప్పలేదు. సీబీఐ, ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదించగా మనీష్ సిసోడియా తరపున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు విన్పించారు. ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు, మనీ ల్యాండరింగ్ జరిగాయనే ఆరోపణలతో అటు సీబీఐ, ఇటు ఈడీ వేర్వేరుగా కేసులు నమోదు చేసి మనీష్ సిసోడియాను వేర్వేరుగా అరెస్టు చేశారు. 2023 ఫిబ్రవరి 26న అరెస్ట్ కావడంతో ఫిబ్రవరి 28న కేబినెట్‌కు రాజీనామా చేశారు. ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్ట్ చేయగా, మార్చ్ 9న ఈడీ అరెస్టు చూపించింది. విశ్లేషణలో కొన్ని అనుమానాస్పద అంశాలున్నందునే మనీష్ సిసోడియాకు బెయిల్ తిరస్కరిస్తున్నట్టు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. 


Also read: Kerala Blast Case: కేరళ పేలుళ్ల ఘటనలో లొంగిపోయిన నిందితుడు,దేశ ద్రోహ పాఠాలు చెబుతున్నారంటూ ఆరోపణ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook