Kerala Blast Case: కేరళ పేలుళ్ల ఘటనలో లొంగిపోయిన నిందితుడు, దేశ ద్రోహ పాఠాలు చెబుతున్నారంటూ ఆరోపణ

Kerala Blast Case: కేరళ వరుస పేలుళ్ల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేలుళ్లు తానే జరిపానంచూ ఓ వ్యక్తి త్రిశూర్ పోలీసులకు లొంగిపోయాడు. ఈ వ్యవహారంపై కేరళ పోలీసులు ఇప్పుడు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 30, 2023, 09:09 AM IST
Kerala Blast Case: కేరళ పేలుళ్ల ఘటనలో లొంగిపోయిన నిందితుడు, దేశ ద్రోహ పాఠాలు చెబుతున్నారంటూ ఆరోపణ

Kerala Blast Case: కేరళ ఎర్నాకులం జిల్లాలోని కళామస్సేరిలో మత ప్రార్ధనలు జరుగుతున్న ఓ కన్వెన్షన్ సెంటర్‌లో వరుసగా మూడు భారీ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 3కు చేరింది. 50 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు ఈ ఘటనలో లొంగిపోయిన నిందితుడు చెప్పే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

కేరళ బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 3కు పెరిగింది. 50మందికి పైగా గాయాలపాలయ్యారు. ఎర్నాకులం జిల్లా కళామస్సేరిలోని జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో వరుసగా రెండ్రోజుల్నించి మత ప్రార్ధనలు జరుగుతున్నాయి. మూడవరోజు అంటే నిన్న ఆదివారం ఉదయం ఒక్కసారిగా భారీ విస్ఫోటనాలు చోటుచేసుకున్నాయి. వరుసగా మూడుసార్లు బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకూ ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 52 మందికి గాయాలయ్యాయి. బాంబు పేలుడు ఘటనతో ఉలిక్కిపడిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం లోతుగా విచారణ చేపట్టాయి. ఉగ్రకోణం ఉందేమోననే అనుమానాలు వ్యక్తం చేశాయి. 

ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాంబు పేలుళ్లు జరిపింది తానేనని చెబుతూ డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తి త్రిశూర్ పోలీసుల ముందు లొంగిపోయాడు. తానే పేలుళ్లు జరిపాననేందుకు ఆ వ్యక్తి ఇచ్చిన ఆధారాల్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసులకు లొంగిపోయేముందు ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియా వైరల్ అవుతోంది. యెహోవా విట్నెస్ సంస్థలో 16 ఏళ్లుగా పనిచేస్తున్నానని, అక్కడ దేశద్రోహ పాఠాలు చెబుతున్నారని మార్టిన్ వివరించాడు. ఈ పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా విన్పించుకోలేదని అందుకే ఇలా చేసినట్టు వీడియో ద్వారా తెలిపాడు. 

అదే సమయంలో లొంగిపోయిన నిందితుడు పేలుళ్లకు ఉపయోగించిన ఎల్ఈడీ అతనికి ఎక్కడ్నించి వచ్చిందనే కోణాన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 70 సీసీటీవీ వీడియోలను పరిశీలించగా బ్లూ కలర్ కారు అనుమానాస్పదంగా కన్పించింది. ఇది బలేనో కారు. నెంబర్ ప్లేట్‌పై రాంగ్ నెంబర్ అని రాసుంది.

కేరళ పేలుళ్ల ఘటనలో లొంగిపోయిన డొమినిక్ మార్టిన్ చెబుతున్నది నిజమా కాదా అనే కోణంలో ముందుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ నిజమైతే యొహోవా విట్నెస్ సంస్థపై చేసిన ఆరోపణలపై కూడా విచారించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దేశ ద్రోహానికి సంబంధించిన ఆరోపణలు కావడంతో కేసుకు మరింత ప్రాధాన్యత ఏర్పడుతుంది. 

Also read: Kerala Blast: కేరళలో భారీ పేలుడు, ఒకరి మృతి, 40 మందికి గాయాలు, రాష్ట్రమంతటా అలర్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News