Supreme Court: దేశంలో వివిద చట్ట సభల్లో సభ్యులపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణ విషయంలో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుల్ని సత్వరం పరిష్కరించే బాధ్యతను హైకోర్టులకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటు చేసుకోవాలని కోరింది. మరో 6 నెలల్లో లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై జీవితకాల  నిషేధం విధించాలని దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుల్ని జాప్యం లేకుండా సత్వరం విచారించే బాధ్యతను హైకోర్టులకు అప్పగించింది సుప్రీంకోర్టు. అవసరమైతే సుమోటో కేసులు నమోదు చేసి, ప్రత్యేక బెంచ్‌లతో సత్వర విచారణ చేపట్టాలని, దిగువ కోర్టులు విచారణ వాయిదా వేయకూడదని సుప్రీంకోర్టు తెలిపింది. దీనికోసం అన్ని దిగువ కోర్టులకు ముఖ్యంగా కేసు నడిచే ట్రయల్ కోర్టులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడం కష్టమని సూచించింది. 


సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. చట్టసభల కేసుల స్థితిగతులపై హైకోర్టులు ట్రయల్ కోర్టుల్నించి నివేదిక కోరవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ తరహా కేసుల విచారణకు ఏర్పాటు చేసే ప్రత్యేక బెంచ్‌లకు ప్రధాన న్యాయమూర్తి లేదా సీజేఐ నియమించిన న్యాయమూర్తి లీడ్ చేస్తారని ప్రకటించింది. 


చట్టసభల సభ్యులపై నమోదైన క్రిమినల్ కేసు విచారణను త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తప్పనిసరిగా  ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలి. అవసరాన్ని బట్టి ఆ బెంచ్‌కు కేసులు క్రమపద్ధతిలో కేటాయించాలి.


Also read: Chandrababu Case Updates: చంద్రబాబు క్వాష్‌పై కొనసాగుతున్న సస్పెన్స్, దీపావళి తరువాతే తీర్పు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook