Supreme Court Serious On Two Finger Test Of Rape Victims: అత్యాచార బాధితులకు చేస్తున్న రెండు వేళ్ల పరీక్షపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అది తప్పు అని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. 2013లో నిషేధం ఉన్నప్పటికీ, లైంగిక వేధింపులకు గురైన బాధితురాలికి రెండు వేళ్ల పరీక్ష చేయడం పదేపదే బాధిస్తోందని సుప్రీంకోర్టు పేర్కొంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇకపై రేప్ కేసు బాధితులకు అలాంటి టెస్టులు నిర్వహించొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ టెస్ట్ మహిళల గౌరవం, గోప్యతకు భంగం కలిగించేలా ఉందని.. ఎప్పటిదో అయిన ఈ రూల్ ఈరోజుకు కూడా కొనసాగడం దురదృష్టకరమని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కాలేజీల స్టడీ మెటీరియల్ నుంచి ఈ టెస్ట్ సిలబస్ తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ కార్య దర్శులను కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది.


అత్యాచారం కేసుల్లో రెండు వేళ్ల పరీక్ష నిర్వహించే వ్యక్తి దుష్ప్రవర్తనకు పాల్పడతారని పేర్కొన్న కోర్టు పితృస్వామ్య మనస్తత్వం ఆధారంగా ఈ రెండు వేళ్ల పరీక్ష చేయకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ పరీక్షపై అసంతృప్తిని వ్యక్తం చేసిన జస్టిస్ డివై చంద్రచూడ్, బాధితురాలి లైంగిక చరిత్ర రుజువు కోసం రెండు వేళ్ల పరీక్ష ముఖ్యం కాదని పేర్కొన్నారు. ఈ రేప్ కేసుల్లో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం నిందితులను తరువాత నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తోసిపుచ్చింది.


ఈ కేసులో నిందితులకు సుప్రీంకోర్టు జీవిత ఖైదు విధించింది. నిజానికి 2013లో సుప్రీంకోర్టు రెండు వేళ్ల పరీక్ష రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఇక అత్యాచార బాధితురాలి పట్ల ఎలా వ్యవహరించాలనే దానిపై మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ పోలీసులు సహా ఆరోగ్య శాఖల అధికారులు ఇలాంటి విషయాలలో మరింత సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని  లేని పక్షంలో వారిపై కూడా చర్యలు తీసుకోవచ్చని కోర్టు నొక్కి చెప్పింది.


రెండు వేళ్ల పరీక్ష అంటే ఏమిటి? 
రెండు వేళ్ల పరీక్షలో, బాధితురాలి ప్రైవేట్ భాగంలో ఒకటి లేదా రెండు వేళ్లను చొప్పించడం ద్వారా బాధితురాలి కన్యత్వాన్ని వైడీలు పరీక్షిస్తారు. ఆ మహిళకు శారీరకంగా ఇంతకు ముందు ఎవరితో అయినా కలిసిందా లేదా లేదా అనేది తెలుసుకునేందుకు ఈ పరీక్షను చేస్తారు. అలా  రెండు వేళ్లు ప్రైవేట్ పార్ట్‌లో సులభంగా కదులుతున్నట్లయితే, స్త్రీ లైంగికంగా చురుకుగా ఉందని, తద్వారా ఆ స్త్రీ కన్య కాదనే దానికి నిదర్శనంగా కూడా పరిగణించబడుతుంది. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం రెండు వేళ్ల పరీక్షకు శాస్త్రీయ ఆధారం లేదని, అధికారులు దానిని ఉపయోగించరాదని పేర్కొంది.  


సుప్రీంకోర్టు ఎందుకు ఇలా వ్యాఖ్యానించింది? 
నిజానికి అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న ఓ యువకుడిని హైకోర్టు నిర్దోషిగా ప్రకటించగా ఆ కేసు సుప్రీంకోర్టుకు వచ్చింది. హైకోర్టు ఉత్తర్వును రద్దు చేస్తూ ఆ వ్యక్తిని నిందితుడిగా సుప్రీంకోర్టు పరిగణించింది. ఈ సంధర్భంగా అతన్ని నిర్దోషిగా నిరూపించడానికి చేసిన రెండు వేలి పరీక్షలకు శాస్త్రీయ ఆధారం లేదని, అధికారులు దానిని ఉపయోగించకూడదని చెప్పింది. ఈ పరీక్ష వల్ల బాధిత మహిళ పదే పదే శారీరక, మానసిక వేదనకు గురికావాల్సి వస్తోందని, పరీక్షలో పాజిటివ్‌ వచ్చినా ఆ సంబంధం ఏకాభిప్రాయమని నిరూపించలేమని కూడా కోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ తీర్పుతో మహిళా సంఘాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
Also Read: Morbi Cable Bridge Collapse Viedo: కేబుల్ బ్రిడ్జ్‌పై భారీగా జనాలు.. ఎలా పడిపోతున్నారో చూడండి.. వీడియో వైరల్


Also Read: New Rules Form November 1: రేపటి నుంచి కొత్త రూల్స్‌.. మారనున్న ట్రైన్స్ టైమింగ్.. గ్యాస్ సిలిండర్ ధరలు కూడా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook