Supreme Court: న్యాయస్థానాల ముందు ఒక్కోసారి విచిత్రమైన కేసులు వస్తుంటాయి. అందుకే అప్పుడప్పుడూ పిటీషనర్లపై న్యాయస్థానాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భాలు చూస్తుంటాం. అదే జరిగింది సుప్రీంకోర్టులో.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొన్నటికి బీకామ్‌లో ఫిజిక్స్ ఉందని అన్నందుకే నానా విధాలుగా ట్రోలింగ్ అయ్యాడు మాజీ ఎమ్మెల్యే. అప్పట్నించి బీకామ్‌లో ఫిజిక్స్ అనేది బాగా ప్రాచుర్యంలో వచ్చేసింది. ఇప్పుడు అదే కోవకు చెందిన మరో వ్యక్తి వార్తల్లో నిలిచాడు. కోవిడ్ సంక్రమణ (Covid Spread) ప్రారంభమైనప్పటి నుంచీ దేశంలో ప్రతి ఒక్కడూ ఓ వైద్యుడిగా మారిపోతున్నారు. ఎవరికిష్టం వచ్చిన మెడిసిన్స్ వారు సూచించేస్తున్నారు. అయితే ఇది కేవలం వాట్సప్ ఇండస్ట్రీకే పరిమితం కాలేదు. ఏకంగా న్యాయస్థానాన్ని కూడా తాకింది.


కోల్‌కత్తా(Kolkatta)కు చెందిన సురేష్ షా అనే వ్యక్తి కోవిడ్ నిర్ధారణకు చేయాల్సిన పరీక్షలు, చికిత్సకు సంబంధించిన అంశాల్ని సూచిస్తూ..విచారణ చేసి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటీషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిగిన ఛీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు వైద్యులా..కోవిడ్‌పై మీకున్న జ్ఞానమేంటని పిటీషనర్‌ను న్యాయస్థానం ప్రశ్నించగా..కేవలం శాస్త్రీయ పత్రాల ఆధారంగా పిటీషన్ దాఖలు చేసినట్టు తెలిపాడు. కామర్స్ చదువుకుని వైద్యులు, వైద్య నిపుణులకే కరోనా చికిత్స ఎలా చేయాలో బోధిస్తారా అంటూ జస్టిస్ ఎన్ వి రమణ (Justice NV Ramana) మండిపడ్డారు. ఇలాంటి పనికిమాలిన పిటీషన్లు వేయడమే మీ పనా అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. వర్చువల్ హియరింగ్ కాబట్టి ఖర్చులేదని..లేకపోతే ఇలాంటి పిటీషన్‌తో కోర్టు సమయం వృధా చేసినందుకు  లక్ష జరిమానా విధించాలనుకున్నామని ధర్మాసనం చెప్పడంతో ఆ పిటీషనర్ ఖంగు తిన్నాడు. తాను నిరుద్యోగినని చెప్పడంతో వేయి రూపాయల జరిమానాతో సరిపెట్టింది.


Also read: Karnataka: కోవిడ్‌తో మరణం..ఎన్నికల్లో భారీ విజయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook