UP Slapping Case: ముస్లిం విద్యార్ధి చెంపదెబ్బ కేసులో సుప్రీంకోర్టు సీరియస్, ప్రభుత్వానికి చీవాట్లు
UP Slapping Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ముస్లిం విద్యార్ధి చెంపదెబ్బ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
UP Slapping Case: యూపీలోని ముజఫర్ నగర్ స్కూల్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఓ ప్రైవేట్ స్కూల్ మహిళా టీచర్ ఓ ముస్లిం విద్యార్ధినిని తోటి విద్యార్ధులతో వరుసగా చెంప దెబ్బలు కొట్టించిన ఘటన ఇది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని ప్రభుత్వాన్ని మందలించింది.
ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్ మహిళా టీచర్ చేసిన దాష్టీకం దేశవ్యాప్తంగా సంచలనమైంది. స్కూల్‌లోని ఓ ముస్లిం విద్యార్ధినిని తోటి విద్యార్ధులతో వరుసగా చెంపదెబ్బలు కొట్టించింది ఆ టీచర్. అంతేకాకుండా ఆ టీచర్ ముస్లింలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ఇంకా గట్టిగా కొట్టండి, నడుముపై కూడా కొట్టండంటూ ఆదేశాలు జారీ చేసింది ఆ టీచర్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. బాధిత విద్యార్ధి తండ్రి సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం ప్రదర్శించారు.
ఈ ఘటనపై సుప్రీంకోర్టు స్పందించింది. జస్టిస్ పంకజ్ మిథాల్ దర్మాసనం విచారణ చేపట్టింది. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడింది. బాధితుడి తండ్రి ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని నిలదీసింది. విద్యాహక్కు చట్టం కింద కచ్చితంగా చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఓ వర్గానికి చెందిన విద్యార్ధిపై ఇలాంటి దాడి జరిగిందంటే కచ్చితంగా అక్కడ నాణ్యమైన విద్య అందడం లేదనే భావించాల్సి వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది.
తక్షణం ఈ ఘటనపై ప్రత్యేకంగా ఐపీఎస్ అధికారిని నియమించి విచారణ జరిపించి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ ఘటనలో బాధిత బాలుడికి కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించింది. ఇతర విద్యార్ధులతోనూ మాట్లాడాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమౌతున్నాయి. కోర్టు యూపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఇది చాలా తీవ్రమైన విషయమని, ఓ వర్గానికి చెందిన విద్యార్ధిని లక్ష్యంగా చేసుకుని తోటి విద్యార్ధులతో చెంప దెబ్బలు కొట్టించడం సహించరానిదని స్పష్టం చేసింది. ఇదేనా చదువంటే అని ప్రశ్నించింది. ఆ బాధిత విద్యార్ది చదువు బాధ్యత అంతా ప్రభుత్వానిదేనని కోర్టు వెల్లడించింది. ఓ వర్గానికి చెందిన విద్యార్ధిని ఉద్దేశ్యపూర్వకంగా కొట్టించారన్న ఆరోపణలు నిజమైతే రాష్ట్రంలో అలజడి సృష్టిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది.
Also read: UIDAI Updates: ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీలను ఇకపై స్వయంగా వెరిఫై చేసుకోవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook