Supreme Court Collegium Issue: సుప్రీంకోర్టు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం, కొలీజియంపై పెరుగుతున్న వివాదం
Supreme Court Collegium Issue: సుప్రీంకోర్టు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం వివాదం మళ్లీ రాజుకుంటోంది. ఇప్పుడు కూడా కొలీజియం విషయంలో ఇరువురి మధ్య అంతరం పెరుగుతోంది. కొలీజియం సిఫార్సుల విషయంలో పేచీ ముదురుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court Collegium Issue: దేశంలోని అత్యున్నత న్యాయ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య అంతరం పెరుగుతోంది. దేశంలోని వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తుల్ని నియామకం విషయంలోనే ఈ పేచీ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేయడమే ఇందుకు కారణం.
దేశంలో సుప్రీంకోర్టు సహా వివిధ హైకోర్టు న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తుల ఎంపిక సుప్రీంకోర్టు కొలీజియం ద్వారా జరుగుతుంటుంది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన పేర్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంటుంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం అనేది ఓ లాంఛన ప్రక్రియ మాత్రమే. అయితే కొలీజియం సిఫారసు చేసిన పేర్లను కేంద్ర ప్రభుత్వం తిరిగి పరిశీలించి కొన్నింటికే ఆమోదం తెలుపడం, కొన్ని పెండింగులో పెట్టడం చేస్తోందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధూలియాల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడింది. ఒక హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు న్యాయమూర్తుల బదిలీకి కొలీజియం చేసిన సిఫార్సుల్ని కేంద్ర ప్రభుత్వం పెండింగులో పెట్టడం ఆందోళనకరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
సుప్రీంకోర్టు సిపార్సుల్ని ఆమోదించడంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై దాఖలైన రెండు పిటీషన్లను ఈ ధర్మాసనం విచారిస్తోంది. కొలీజియం సిఫారసు చేసిన పేర్లలో కొన్ని ఆమోదించి, కొన్ని పెండింగులో పెట్టడం వల్ల సీనియారిటీ మారిపోతోందని కోర్టు అభిప్రాయపడింది. కొలీజియం సిఫారసుల్ని తిరిగి పరిశీలించి ఎంపిక చేయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల్ని న్యాయవ్యవస్థకు వదిలేయాలని సూచించింది. ఈ పిటీషన్‌పై విచారణ నవంబర్ 20కు వాయిదా పడింది.
ఉన్నత న్యాయస్థానాల్లో ఖాళీల భర్తీకు కొలీజియం చేసిన సిఫారసుల జాబితాలో కొందర్ని మాత్రమే కేంద్రం ఎంపిక చేయడం, మిగిలినవారిని పెండింగులో పెట్టడం మంచిది కాదని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఇబ్బందికరంగా ఉంటోందని కోర్టు తెలిపింది.
Also read: Vistara Airlines: విమాన ప్రయాణీకులకు శుభవార్త, ఆ విమానాల్లో ఇక వైఫై ఇంటర్నెట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook