Surat Chemical Factory Fire: గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో ఉన్న సచిన్ జీఐడీసీ కెమికల్ ఫ్యాక్టరీలో నవంబర్ 29వ తేదీ ఉదయం భారీ పేలుడు సంభవించింది. మంటలు భారీగా చెలరేగడంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఏడుగురు అగ్నికి ఆహుతయ్యారు. మరో 25 మందికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూరత్‌లోని కెమికల్ ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న భారీ విస్ఫోటనం అనంతరం చెలరేగిన మంటలతో భయానక వాతావరణం నెలకొంది. ఘటన జరిగిన వెంటనే పెద్దఎత్తున అగ్నిమాపక బృందాలు రంగంలో దిగాయి. దాదాపు 15 ఫైర్ ఇంజన్లతో 10 గంటలపాటు శ్రమించిన తరువాతే మంటలు అదుపులో వచ్చాయి. కెమికల్ బ్లాస్ట్ కావడంతో మంటల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే అగ్నికి ఆహుతయ్యారు. వీరిలో ఆరుగురు కాంట్రాక్ట్ ఉద్యోగులు కాగా ఒకరు కంపెనీ ఉద్యోగి. మరో 25 మందికి తీవ్ర గాయాలవడంతో సమీపంలో వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సూరత్ జిల్లా కలెక్టర్ ఆయూష్ ఓక్ తెలిపారు. 


కెమికల్ ఫ్యాక్టరీ ట్యాంకులో నిల్వ ఉండే రసాయనాలు లీక్ అవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా సూరత్ ఫైర్ ఆఫీసర్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 150మంది పనిచేస్తున్నట్టు సమాచారం. మృతుల్లో కంపెనీ ఉద్యోగి దివ్యేష్ పాటిల్ సహా ఒప్పంద కార్మికులు సంతోష్ విశ్వకర్మ, సనత్ కుమార్ మిస్రా, ధర్మేంద్ర కుమార్, గణేష్ ప్రసాద్, సునీల్ కుమార్, అభిషేక్ సింఘ్ ఉన్నారు. 


Also read: Gujarat High Court: గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు, అజాన్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిల్ కొట్టివేత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook