Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తనం, ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు మధ్య విస్తరించి ఉంది. నిన్న ఏపీ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ఇవాళ బలహీన పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే సమయంలో ఉత్తర-దక్షిణ ద్రోణి..ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా కొమరం ప్రదేశం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కేంద్రీకృతమైంది. వీటి ప్రభావంతో రాగల మూడురోజులపాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రేపు మరికొన్ని చోట్ల ఇదే వాతావరణం ఉంటుందని వెల్లడించింది.


ఎల్లుండి మాత్రం తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు ఏపీలోనూ ముసురు పట్టుకుంది. ఉదయం నుంచి చిరుజల్లు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో అక్కడకక్కడ భారీ వర్షాలు సైతం కురుస్తున్నాయి. రాగల మూడురోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి. తీరం వెంట ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 


తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. కృష్ణ, గోదావరి, తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 39 వేల 736 క్యూసెక్కులు ఇన్‌ ఫ్లో ఉండగా..63 వేల 647 క్యూసెక్కులు ఔట్ ఫ్లోగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా..ప్రస్తుతం 879.79 అడుగులుగా ఉందని అధికారులు తెలిపారు.


Also read:BJP MPS Protest: రాష్ట్రపతిని 'రాష్ట్రపత్ని' అని వ్యాఖ్యానించిన MP అధీర్ రంజన్.. క్షమాపణ చెప్పాలంటూ BJP ఎంపీల నిరసన


Also read:Minister Malla Reddy: మూడు నెలల క్రితం MLA స్టిక్కర్ పడేశాడట!.. మంత్రి మల్లారెడ్డి కవరింగ్ అదుర్స్..  



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook