లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ సరికొత్త వ్యూహాల రూపకల్పనకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే మిగతా పార్టీలకు భిన్నంగా ‘టీ20’ సూత్రాన్ని తాము అమలు చేస్తున్నట్లు అదే పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు చెప్పడంతో ప్రస్తుతం ఈ విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సూత్రం ప్రకారం యువతను పార్టీ ఎక్కువగా ఉపయోగించుకోనుంది. ఒక్కో బూత్ నుండి సాంకేతికంగా నిష్ణాతులైన 10 మంది యువకులను ఎంపిక చేసి.. వారితో నమో యాప్ ద్వారా పార్టీ ఎప్పటికప్పుడు స్థానిక సమాచారం సేకరిస్తూ... సంప్రదింపులు జరుపుతూ పావులు కదిపే అవకాశం ఉందనేది సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లి వారికి బీజేపీ పట్ల మంచి అభిప్రాయం కలిగేలా చేయడం అనేది ఈ టీ20 సూత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. బూత్ స్థాయి కార్యకర్తలను ఈ సూత్రం ప్రకారం ఎక్కువగా ఉపయోగించుకోనున్నారు. వారిని నమో యాప్‌తో అనుసంధానం చేయనున్నారు. అందుకు అనుగుణంగానే యాప్‌లో మార్పులు చేర్పులు కూడా చేయనున్నారని తెలుస్తోంది.


ప్రతీ బూత్‌లో దాదాపు 100 మంది నమో యాప్ వాడేలా చేయాలన్నదే టీ20 సూత్రంలో ప్రథమ లక్ష్యం. అలాగే "ఇంటింటికీ బీజేపీ" కార్యక్రమం ద్వారా వార్డు స్థాయి నుండి జిల్లా స్థాయి వరకూ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గురించి ప్రచారం చేయడం.. ఆ పథకాల గురించి తెలియవారిలో అర్హులైన వారికి ఆ పథకాల వల్ల లాభం చేకూర్చేలా చేయడం అనేది టీ20 సూత్రంలో భాగంగా కార్యకర్తల ముందుండే మరో ప్రధాన లక్ష్యం.