భారతీయ జనతా పార్టీ నాయకుడు, ఉత్తర ప్రదేశ్ సర్దానా ఎమ్మెల్యే సంగీత్ సోమ్ దిగ్గజ స్మారక చిహ్నం తాజ్ మహల్ పై  మరొక వివాదానికి తెరలేపారు. ప్రపంచ ప్రఖ్యాత స్మారక కట్టడాన్ని "ద్రోహులు నిర్మించారని, భారతీయ చరిత్రలో భాగం కాదని" అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"యుపి పర్యాటక బుక్లెట్ నుండి తాజ్ మహల్ ను తొలగించారని చాలా మంది నిరాశ చెందారు. మనం ఏ చరిత్ర గురించి మాట్లాడుతున్నాం?  తాజ్ మహల్ సృష్టికర్త తన తండ్రిని ఖైదు చేశాడు. అతను హిందూలను తుడిచివేయాలని కోరుకున్నాడు. ఇలాంటి ప్రజలు మన చరిత్రలో భాగమైతే, అంతకంటే విచారం మరేదీలేదు. మేము ఈ చరిత్రను మారుస్తాము" అని చెప్పారు.