జూన్ 30 వరకు అక్కడ ఉచిత భోజనం
కరోనా వైరస్ ప్రపంచ దేశాలతో పాటు మన దేశాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా తీవ్రతను కాస్తయినా ఆపవచ్చు. ఆకలికష్టాలు తప్పించాలని భావించిన ప్రభుత్వం జూన్ 30వరకు ఉచితంగా భోజనం అందిస్తోంది.
కరోనా వైరస్(CoronaVirus) మహమ్మారి తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న రాష్ట్రాలలో తమిళనాడు ఒకటి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కొనసాగిస్తున్న లాక్‌డౌన్ నేటికీ వలసకూలీలు, దినసరి కార్మికుల పాలట శాపంగా మారింది. ఆకలి చావులు నమోదవుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30వ తేదీ వరకు అమ్మ క్యాంటీన్లలో ఉచితంగా భోజనం అందించనున్నారు. Photos: ఆకాశంలో అద్భుతం.. సూర్యగ్రహణం ఎక్కడ.. ఎలా, ఫొటో గ్యాలరీ
ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఇదివరకే అధికారులను ఆదేశించింది. సరైన ఆహారం తినకపోవడంతో, పోషకాహారం లోపించి ఆకలి చావులతో పాటు రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. తద్వారా మనిషి కరోనా బారిన పడే అవకాశాలు పెరుగుతాయి. దీంతో చెన్నై మెట్రో నగరంలోని అన్ని అమ్మ క్యాంటీన్లలో జూన్ 30 వరకు ఉచిత ఇడ్లీ, సాంబారు, భోజనం ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. కేకే నగర్‌లో నిత్యం వలస కార్మికులు అమ్మ క్యాంటీన్లకు వస్తుంటారు. వారి కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం హర్షనీయం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ