Surprise visit from MK Stalin: ఓ కార్యక్రమానికి హాజరై తిరుగు ప్రయాణం చేస్తున్న స్టాలిన్ మార్గం​ మధ్యలో ఓ ఆర్టీసి బస్సును (MK Stalin in RTC bus) గమనించి.. తన కాన్వాయ్​ను పక్కకు ఆపించారు. కాన్వాయ్​ నుంచి దిగి ఆ బస్సు ఎక్కి అందరిని ఆశ్చర్యానికి (MK Stalin Surprise) గురి చేశారు స్టాలిన్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొంత దూరం అదే బస్సులో ప్రయాణించి స్టాలిన్​.. బస్సులో సదుపాయాలు గురించి ఆరా తీశారు. మహిళలకు అందిస్తున్న ఉచిత టికెట్ సదుపాయం గురించి అందులోని మహిళలను అడిగి తెలుసుకున్నారు. కరోనా నేపథ్యంలో మాస్క్​ లేకుండా ప్రయాణిస్తున్న వారిని.. తప్పకుండా మాస్క్ వాడాలని సూచించారు.


అనుకోకుండా సీఎం బస్సెక్కడంతో.. బస్సంతా సందడిగా మారింది. ప్రయాణికులు ఆయనతో మట్లాడేందుకు ఊత్సాహం చూపించారు. ఆయనతో సెల్ఫీలు దిగారు. స్టాలిన్ కూడా అందరితో సరదాగా మాట్లాడారు.



ఆయితే స్టాలిన్ ఇలా ఆకస్మిక తనిఖీలు చేయడం ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టిన సందర్భాలున్నాయి.


Also read: Amarinder Singh : పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు ఐఎస్ఐతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు


Also read: KBC 13: సెక్యూరిటీ గార్డ్ కుమారుడు రూ. కోటి గెలిచాడు..తాఫ్సీ ఆఫర్ ఇచ్చింది..!


ఏమిటి ఈ ఉచిత టికెట్ సదుపాయం..


మహిళలకు సురక్షిత ప్రయణ సదుపాయం కల్పించే ఉద్దేశంతో తమిళనాడు ప్రభుత్వ ఉచిత టికెట్ పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా టౌన్ బస్సులో నడిచే బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణించే వీలు కలుగుతుంది. దీని ద్వారా బస్సులో ప్రయాణించే మహిళల సంఖ్య కూడా పెరుగుతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉచితంగా టికెట్ అందించడం ద్వారా ఎంత మంది బస్సులో ప్రయాణిస్తున్నారు అనే విషయాన్ని కూడా ప్రభుత్వం తెలుసుకుంటుంది.


Also read: Onion Causes Disease: ఆ ఉల్లిపాయలు అస్సలు ముట్టవద్దు..చాలా డేంజర్ సుమా


Alos read: Nasser Hussain: టీమిండియా వద్ద ప్లాన్‌-బి లేదు.. అదే ఆ జట్టుకు మైనస్!: నాసర్ హుస్సేన్


స్టాలిన్ సమ్​థింగ్ స్పెషల్​..


ఇంతకు ముందు కూడా ఓ సారి.. రోడ్డుపై వెళ్తూ కాన్వాయ్​ నుంచి దిగి ఓ వృద్ధురాలి వద్ద దరఖాస్తు తీసుకుని అందరి ప్రశంసలందుకున్నారు. మరో రోజు.. ఓ ఫంక్షన్ హాల్​ వద్ద తనకు తెలియని ఓ నవ వదూవరులను కలిసి ఆశ్చర్యానికి గురిచేశారు.


ఇదే కాకుండా.. రాజకీయ పరంగా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు స్టాలిన్​. తనపై పొగడ్తలు మానుకోవాలని సొత పార్టీ నేతలకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో పొగడ్తల వల్ల విలువైన సమయం వృథా కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.


డిమాండ్లపై చర్చిస్తున్నప్పుడు ప్రశంసిస్తూ మాట్లాడితే వారిపై చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. తన కాన్వాయ్​ వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా.. వాహనాల సంఖ్యను కూడా తగ్గించుకున్నారు స్టాలిన్​. సీఎం ఆదేశాల మేరకు 14 ఉండాల్సిన కాన్వాయ్​ వాహనాలు 7కి తగ్గించారు అదికారకులు.


రాష్ట్రంలో ప్రభుత్వ విద్యార్థులకు ఇచ్చేందుకు ఉద్దేశించిన 65 లక్షల బ్యాగ్​లపై మాజీ సీఎంలు.. జయలలిత, పళనిస్వామి ఫొటోలను అలానే ఉంచాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు స్టాలిన్. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.13 కోట్ల ఆదా అవుతాయని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇలా కొత్త కొత్త నిర్ణయాలతో స్టాలిన్.. రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు.


Also read:  Trekking Tragedy: హిమాచల్‌ప్రదేశ్ ట్రెక్కింగ్ విషాదంలో 11కు చేరిన మృతుల సంఖ్య


Also read: NEET PG 2021 Admissions: పీజీ నీట్ 2021 అడ్మిషన్లకై కౌన్సిలింగ్ మరో రెండ్రోజుల్లో ప్రారంభం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook