KBC 13: సెక్యూరిటీ గార్డ్ కుమారుడు రూ. కోటి గెలిచాడు..తాఫ్సీ ఆఫర్ ఇచ్చింది..!

KBC 13: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌ చేస్తున్న కౌన్‌ బనేగా క్రోర్‌పతి షోలో కోటి రూపాయలు గెలుచుకున్న రెండో వ్యక్తిగా సెక్యూరిటీ గార్డ్ కుమారుడు సాహిల్‌ ఆదిత్య అహిర్‌వార్‌ నిలిచాడు. వివరాల్లోకి వెళితే..

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2021, 02:44 PM IST
KBC 13: సెక్యూరిటీ గార్డ్ కుమారుడు రూ. కోటి గెలిచాడు..తాఫ్సీ ఆఫర్ ఇచ్చింది..!

KBC 13: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌ చేస్తున్న షో 'కౌన్‌ బనేగా క్రోర్‌పతి'. ఈ షో క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ షో (Kaun Banega Crorepati )కు సెలెక్ట్ అయ్యే వారిలో కొందరు మాత్రమే కోటి రూపాయలు గెలుచుకుంటారు. అలాంటి వారిలో ఒకడు సాహిల్‌ ఆదిత్య అహిర్‌వార్‌(19). కేబీసీ 13వ సీజన్ లో కోటి రూపాయలు(₹1 crore) గెలిచిన రెండో వ్యక్తిగా నిలిచాడు. 

ఐఏఎస్ నా లక్ష్యం..
మధ్యప్రదేశ్‌ ఛతర్‌పూర్‌ మున్సిపాలిటీకి చెందిన సాహిల్‌ ఆదిత్య అహిర్‌వార్‌(Sahil Ahirwar) తండ్రి సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తుంటాడు. రెండేళ్ల క్రితం వరకు కూడా సాహిల్‌ అ‍ల్లరిచిల్లరిగా తిరిగేవాడు. కాలేజీకి బంక్‌ కొట్టడం.. స్నేహితులతో కలిసి సినిమాలు, షికార్లకు వెళ్లడం చేసేవాడు. చదువు మీద అసలు ఆసక్తి కనపర్చేవాడు కాదు. కానీ గత రెండేళ్లలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు తన జీవితాన్ని మార్చేశాయి అంటాడు సాహిల్. తనకంటూ ఓ లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఐఏఎస్‌ కావాలని నిర్ణయించుకున్నాడు.  సమయం వృథా చేయకుండా దాని కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాడు.

Also read: Allu Arjun appreciates Gaami : గామి చిత్రబృందాన్ని అభినందించిన అల్లు అర్జున్ 

కేబీసీ 13వ సీజన్‌(KBC Season 13)లో పాల్గొనేందుకు సాహిల్‌ ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపాడు. అదృష్టం బాగుండటంతో సెలక్ట్‌ అయ్యాడు. కోటి రూపాయల ప్రశ్న వరకు సరైన సమాధానం చెప్పాడు. ఏడు కోట్ల రూపాయల ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో గేమ్‌ నుంచి క్విట్‌ అయ్యాడు. ఇక సాహిల్ తండ్రి గురించి, తన గురించి చెప్పిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కదిలించాయి. తండ్రి పదో తరగతి వరకు చదువుకున్నాడని... ప్రస్తుతం నోయిడాలో సెక్యూరిటీ గార్డ్‌(Security Guard)గా పని చేస్తున్నాడు అని తెలిపాడు సాహిల్‌.

సాహిల్..మనం కలిస్తే చోలే భాటురే తిందాం: తాప్సీ
ఈ షోలో బిగ్‌ బీ సాహిల్ అహిర్వార్ను ‘మీ ఫేవరేట్‌ హీరోయిన్‌ ఎవరు?’ అని అడగగా.. తాప్సీ పన్ను(Taapsee Pannu) అన్ని సమాధానం ఇచ్చాడు. అంతేకాకుండా ఆమె నా క్రష్‌, లవ్‌ అని తెలిపాడు.  పింక్‌’, ‘బాద్లా’ వంటి సినిమాల్లో అమితాబ్‌(Amitabh Bachchan) కలిసి తాప్సీ స్క్రీన్‌ షేరు చేసుకుంది. దీంతో ఆ సాహిర్‌ సైతం ఆమె గురించి కొన్ని ప్రశ్నలు ఆయన్ని అడిగాడు. ‘ఆమెకి ఇష్టమైన ఫుడ్‌ ఏది?’ అని కంటెస్టెంట్‌ అడగగా.. నాకు తెలియదు అని బిగ్‌ బీ తెలిపాడు. కాగా ఈ వీడియో చూసిన తాప్సీ సోషల్‌ మీడియా(Socail Media)లో రెస్పాండ్‌ అయ్యింది. ‘సాహిల్‌.. నాకు చోలే భాటురే (chole bhature) అంటే ఎంతో ఇష్టం. ఒక వేళ మనం కలిస్తే అది తిద్దాం. ఏడు కోట్ల ప్రశ్నకు చేరినందుకు అభినందనలు’ అంటూ ఆ వీడియోని షేర్‌ చేసింది తాప్సీ. ఫ్యాన్‌కి ఓ హీరోయిన్‌ ఇలాంటి ఆఫర్‌ ఇవ్వడంతో ఆ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

Also read: Samantha Defamation Case: సామాన్యులైన... సమంత అయినా... ఒక్కటే: కూకట్‌పల్లి కోర్టు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News