Tamil Nadu: వంద శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు
ఒకవైపు సంక్రాంతి పండగ, మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండటంతో తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. థియేటర్లు, మల్టీప్లెక్స్‌లో వంద శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Tamil Nadu govt permits 100% occupancy in cinema halls | చెన్నై: ఒకవైపు సంక్రాంతి పండగ, మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండటంతో తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. థియేటర్లు, మల్టీప్లెక్స్‌లో వంద శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనావైరస్ కారణంగా దాదాపు ఆరు నెలలపాటు థియేటర్లు మూతబడిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కేంద్రం విడుదల చేసిన మార్గదర్శాల ప్రకారం.. ఇప్పటివరకు 50 శాతం సీట్ల సామర్థ్యంతో సినిమాహాళ్లు, మల్టీప్లెక్స్‌లను నిర్వహిస్తున్నారు. తాజాగా దీనిని వంద శాతానికి పొడిగిస్తూ తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu govt) మార్గదర్శకాలను విడుదల చేసింది.
అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో తమిళనాడులోని సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు ఇకపై కరోనాకు ముందు మాదిరిగా కళకళలాడుతూ కనిపించనున్నాయి. అయితే సంక్రాంతి పండగ సందర్భంగా కొత్త సినిమాల విడుదలకు రాష్ట్రంలో ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళంలో (Kollywood) పెద్దపెద్ద సినిమాలన్నీ మరో వారం రోజుల్లో రిలీజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్యుపెన్సీని వంద శాతానికి పెంచాలని యజమానులు విన్నవించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. Also Read: Nora Fatehi: హీటెక్కిస్తున్న నోరా ఫతేహి.. బ్యూటిఫుల్ పిక్స్
అయితే తమిళనాడు అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. దీంతోపాటు కరోనా మహమ్మారి కేసులు రాష్ట్రంలో 8వేలకు పైగానే ఉన్నాయని.. జాగ్రత్తగా ఉండాల్సిన సమయంలో ఇలాంటి నిర్ణయాలు తగవంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.
Also Read: Kiara Advani Photos: మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న కియారా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook