Bengalore: బెంగళూరు నగరంలోని కోరమంగళ(Koramangala) మార్స్ కల్యాణమండపం సమీపంలో మంగళవారం అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. అర్థరాత్రి 2 గంటల సమయంలో జరిగిన ఆడి కారు(Car Accident) ప్రమాదంలో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు కలిపి మొత్తం ఏడుగురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటనలో తమిళనాడులోని హోసూరు డీఎంకే ఎమ్మెల్యే వై. ప్రకాశ్‌(DMK MLA Y.Prakash) కుమారుడు కరుణసాగర్‌, కోడలు బిందు సహా ఏడుగురు మృతి చెందారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ఫుట్ పాత్ డివైడర్ ను ఢీకొట్టిన లగ్జరీ కారు సమీపంలోని భవనంపైకి దూసుకెళ్లింది. ప్రమాదానికి గురయ్యేంత వరకు కారు(Car Accident) పూర్తిగా ధ్వంసమైంది. లగ్జరీ కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. ఒకరు ఆసుపత్రిలో చేరగానే మరణించారు. కారు ముందు సీటులో ముగ్గురు, వెనుక సీట్లో నలుగురు కూర్చున్నట్లు తెలుస్తోంది. మరణించిన ఏడుగురికి సెయింట్ జానస్ హాస్పిటల్ లో పోస్టుమార్టం చేస్తున్నట్లు సమాచారం.


Also Read: MP: పాల వ్యాపారి కిరాతకం.. యువకుడిని తాళ్లతో ట్రక్కుకు కట్టి ఈడ్చుకెళ్లి...


మరణించిన వారిలో కొందరు కోరమంగళ(Koramangala)లోని జోలో స్టే పీజీలో నివసిస్తున్నారు. కారు(Car)లోని ఎయిర్‌బ్యాగ్ ఓపెన్‌గా కూడా లేదు జాయింట్ కమిషనర్ ఆఫ్ ట్రాఫిక్, కోరమంగళలో జరిగిన ఘోర ప్రమాదం గురించి తెలియజేసిన డాక్టర్ బిఆర్ రవిచంటెగౌడ, కారులో ఉన్న 7 మందిలో ఎవరూ సీట్ బెల్ట్ పెట్టుకోలేదని చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు కారులోని ఎయిర్ బ్యాగ్ కూడా తెరుచుకోలేదు. మృతులందరూ 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు వారు. బాధితుల్లో ఒకరు తమిళనాడు(Tamilnadu) ఎమ్మెల్యే వై ప్రకాష్ కుమారుడిగా గుర్తించబడ్డారని తమిళనాడు పోలీసులు ధృవీకరించారు. ఇతరుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు గల కారణాలపై పోలీసులు పూర్తి సమాచారం రాబడుతున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook