చెన్నై: తమిళనాడులో కరోనా ఉధృతి తారా స్థాయిలో ఉంది. మంగళవారం తమిళనాడు సర్కారు (Tamilnadu govt) విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఆ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 34,285 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా అదే సమయంలో 468 మంది కరోనాతో కన్నుమూశారు. దేశంలో కరోనావైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి 24 గంటల వ్యవధిలో ఇంత భారీ సంఖ్యలో కరోనా రోగులు చనిపోవడం ఇదే తొలిసారి. దీంతో తమిళనాడులో కరోనా పేరెత్తితేనే హడలిపోయే పరిస్థితి నెలకొంది. గత వారం రోజులుగా తమిళనాడు కరోనా గణాంకాలను పరిశీలిస్తే.. ఏరోజుకు ఆరోజు కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ, కరోనా మరణాల సంఖ్యే భారీగా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడులో ఇటీవల రోజువారీ కరోనా మరణాల సంఖ్యను పరిశీలిస్తే.. మే 21న శుక్రవారం నాడు 467 మంది కరోనాతో చనిపోగా శనివారం నాడు 448 మంది, ఆదివారం 422, సోమవారం 404 మంది కరోనాతో మృతి చెందారు. ప్రతీ రోజు కనీసం 400 కు తగ్గకుండా కరోనా మరణాలు నమోదవుతుండటం గమనార్హం. 


Also read : ఏపీలో 252 Black fungus cases నమోదు.. అందుబాటులోకి Injections


మంగళవారం నమోదైన కొత్త కరోనా పాజిటివ్ కేసులతో కలిపి తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 19,11,496 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో     3,06,652 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మంగళవారం కరోనాతో కోలుకుని డిశ్చార్జ్ అయిన 28,745 మందితో కలిపి ఇప్పటివరకు కరోనా నుంచి రికవర్ అయిన వారి సంఖ్య 15,83,504 కి చేరుకుంది. 


తమిళనాడులో మే 10వ తేదీ నుంచి లాక్‌డౌన్ (Lockdown) అమలులో ఉంది. ఇటీవలే కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin) కరోనాను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటూ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గత శనివారం ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన సీఎం స్టాలిన్.. ఆ తర్వాతి నుంచి రాష్ట్రంలో ఎలాంటి సడలింపులు, మినహాయింపులు లేకుండా పూర్తి లాక్‌డౌన్ (Lockdown in Tamil Nadu) అమలు చేస్తున్నారు.


Also read : మహారాష్ట్రలో 2245 black fungus cases.. చికిత్సకు Amphotericin-B injections కేటాయింపు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook