మహారాష్ట్రలో 2245 black fungus cases.. బ్లాక్ ఫంగస్ చికిత్సకు Amphotericin-B injections కేటాయింపు

ముంబై: మహారాష్ట్రలో మొత్తం 2,245 బ్లాక్ ఫంగస్ కేసులు (black fungus cases) గుర్తించినట్టు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపె తెలిపారు. ఇప్పటికే కరోనా వైరస్‌తో (Coronavirus) కష్టాలపాలవుతున్న మహారాష్ట్రలో తాజాగా బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరిగిపోతుండటం అక్కడి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. బ్లాక్ ఫంగస్ చికిత్సలో కీలకమైన అంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్స్ (Amphotericin-B injection) సరఫరాకు సంబంధించిన వివరాలు కూడా మహారాష్ట్ర సర్కారు వెల్లడించింది.

Last Updated : May 26, 2021, 03:58 AM IST
మహారాష్ట్రలో 2245 black fungus cases.. బ్లాక్ ఫంగస్ చికిత్సకు Amphotericin-B injections కేటాయింపు

ముంబై: మహారాష్ట్రలో మొత్తం 2,245 బ్లాక్ ఫంగస్ కేసులు (black fungus cases) గుర్తించినట్టు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపె తెలిపారు. ఇప్పటికే కరోనా వైరస్‌తో (Coronavirus) కష్టాలపాలవుతున్న మహారాష్ట్రలో తాజాగా బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరిగిపోతుండటం అక్కడి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య పెరగడాన్ని తీవ్రంగా పరిగణించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. బ్లాక్ ఫంగస్‌ను మహమ్మారి వ్యాధుల జాబితాలో చేర్చుతున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా, తెలంగాణ, కర్ణాటక, ఒడిషా, తమిళనాడు రాష్ట్రాలు బ్లాక్ ఫంగస్ వ్యాధిని అంటువ్యాధుల జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే.    

బ్లాక్ ఫంగస్ వ్యాధికి ఉచిత చికిత్స:
మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ వ్యాధి బారిన పడిన రోగులకు మహాత్మా జ్యోతిబా పూలె జన్ ఆరోగ్య యోజన పథకం (Mahatma Jyotiba Phule Jan Arogya Yojana) కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆస్పత్రులలో ఉచిత చికిత్స అందించనున్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తెలిపారు. 

Also read : Black fungus cases in AP : ఏపీలో 252 Black fungus cases నమోదు.. అందుబాటులోకి Injections

Amphotericin-B injection: బ్లాక్ ఫంగస్ చికిత్సకు అంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్స్..
అంతేకాకుండా బ్లాక్ ఫంగస్ చికిత్సలో కీలకమైన అంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్‌కి (Amphotericin-B injection) సంబంధించి 60 వేల వయల్స్ జూన్ 1 నుంచి అందుబాటులోకి రానున్నట్టు మంత్రి రాజేష్ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన ఔషధాలతో సంబంధం లేకుండా అదనంగా ఈ అంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్స్ సరఫరా కానున్నట్టు మంత్రి స్పష్టంచేశారు.

తగ్గిన కరోనా పాజిటివిటీ రేటు, పెరిగిన రికవరీ రేటు:
రాష్ట్రంలో కరోనా పాజిటివి రేటుపై మంత్రి రాజేష్ మాట్లాడుతూ.. ''ప్రస్తుతం కొవిడ్-19 పాజిటివిటీ రేటు 12 శాతంగా రికవరీ రేటు 93 శాతంగా ఉంది'' అని ప్రకటించారు. 

Also read : COVID-19 vaccine కి ముందు లేదా తర్వాత alcohol తీసుకోవచ్చా ? Side effects ఏంటి ?

ఢిల్లీలో 500కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు:
ఢిల్లీలోనూ 500కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు (Black fungus cases in india) నమోదైనట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనాతో వణికిపోయిన ఢిల్లీలో లాక్‌డౌన్ అనంతరం కేసులు తగ్గుముఖం పట్టాయనుకుంటున్న తరుణంలో బ్లాక్ ఫంగస్ కేసులు మొదలయ్యాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News