Tamilnadu: తమిళనాడులో మరో విద్యార్ధి ఆత్మహత్య, 24 గంటల్లో ముగ్గురి బలవన్మరణం, దర్యాప్తుకు ఆదేశం
Tamilnadu: తమిళనాట విద్యార్ధుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. 12వ తరగతి చదువుతున్న మరో విద్యార్ధి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. కేవలం 24 గంటల వ్యవధిలో ఇది 3వ సంఘటన.
Tamilnadu: తమిళనాట విద్యార్ధుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. 12వ తరగతి చదువుతున్న మరో విద్యార్ధి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. కేవలం 24 గంటల వ్యవధిలో ఇది 3వ సంఘటన.
విద్యార్ధుల ఆత్మహత్యలు తమిళనాడులో ఆందోళన కల్గిస్తున్నాయి. తమిళనాడులోని శివనగరి జిల్లాలో ఇవాళ మరో 17 ఏళ్ల విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. శివనగరి జిల్లాలోని అతని స్వగ్రామం కరైకూడిలోని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్ధి. రాష్ట్రంలో గత 24 గంటల్లో విద్యార్ధులు ఆత్మహత్యకు పాల్పడటం ఇది మూడవ సంఘటన కాగా..నెలలో ఐదవది. పోస్ట్‌మార్టమ్ అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించినట్టు కరైకూడి డీఎస్పీ వినోజ్ తెలిపారు.
నిన్న అంటే 24 గంటల్లోపే ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తొలి సంఘటన కడలూరు జిల్లాలో జరగగా..రెండవది శివకాశి సమీపంలోని అయ్యంపట్టిలో చోటుచేసుకుంది. ఇదే నెలలో అంటే జూలై 13వ తేదీన కల్లాకురిచిలోని ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్ధిని హాస్టల్ భవనం మూడవ అంతస్థు నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. విద్యార్ధిని ఆత్మహత్యకు నిరసనగా వేలాదిమంది స్కూల్ భవనాన్ని చుట్టుముట్టి..నిరసన ప్రదర్శన నిర్వహించారు. పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. స్కూల్ బస్సులు, వాహనాలు ధ్వంసం చేశారు.
అదే విధంగా జూలై 25వ తేదీన తిరువల్లూరు జిల్లాలో మరో విద్యార్ధిని హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్ధిని బంధువులు, తల్లిదండ్రులు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఇష్టపడలేదు. పోలీసుల ఒత్తిడి మేరకు తీసుకెళ్లారు. రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్ధినీ విద్యార్ధుల వరుస ఆత్మహత్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు.
Also read: Union Govt: తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు అప్పుడే..కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.