No Luxury Food: తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అదికారులకు నో లగ్జరీ ఫుడ్ అంటున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సంక్షోభంతో(Corona Crisis) ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక వనరుల విషయంలో ఇబ్బంది పడుతోంది. ముఖ్యమంత్రిగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న స్టాలిన్(Mk Stalin)..ఈ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్ధిక కష్టాల నేపధ్యంలో ఉన్న నిధుల్ని పొదుపుగా వాడుకోవాలని ఆదేశించారు. వివిధ శాఖల మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సభకు వచ్చే సమయంలో ఎప్పుడూ అందించే లగ్జరీ ఫుడ్ ఇకపై ఉండదన్నారు. ఎవరి ఫుడ్ వారే తెచ్చుకోవాలని సూచించారు. ఈ నెల 13న తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు(Tamilnadu Assembly Sessions) ప్రారంభమయ్యాయి. సాధారణంగా వివిధ శాఖాల వారీగా నిధుల కేటాయింపులు, చర్చ సాగుతున్న సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, పోలీసులు అందరికీ మద్యాహ్న భోజనం స్టార్ హోటళ్ల నుంచి పంపీణీ జరిగేది. అంతేకాకుండా వివిధ శాఖల తరపున బహుమతులు కూడా అందించేవారు. ఇప్పడిలాంటి కార్యక్రమాలకు స్టాలిన్ చెక్ పెట్టారు. నో లగ్జరీ ఫుడ్(No Luxury Food) అంటున్నారు. స్టాలిన్ తీసుకున్న నిర్ణయంతో కొందరికి ఇబ్బంది కలిగినా..రోజుకు లక్షల రూపాయలు పొదుపు అవడం ఖాయం.


అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి స్టాలిన్ (MK Stalin)కొత్త ఆదేశాలు అమలవుతున్నాయి. ఎవరికివారు ఇంటి నుంచి క్యారియర్లు తెచ్చుకుంటున్నారు. లేదా సొంత ఖర్చులతో క్యాంటీన్‌లకు వెళ్తున్నారు. 


Also read: Judges Security: న్యాయమూర్తుల భద్రత కేంద్రమే చేపట్టాలి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook