MK Stalin: పొగడ్తలు మానకపోతే చర్యలు తప్పవంటున్న ముఖ్యమంత్రి
MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఏం చేసినా విభిన్నంగా ఉంటోంది. వినూత్న నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్న ఆయన మరోసారి సంచలనం రేపారు. పొగిడినందుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి..ఆశ్చర్యపరిచారు.
MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఏం చేసినా విభిన్నంగా ఉంటోంది. వినూత్న నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్న ఆయన మరోసారి సంచలనం రేపారు. పొగిడినందుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి..ఆశ్చర్యపరిచారు.
ప్రపంచంలో పొగడ్త అంటే పడనివారు ఎవరూ ఉండరు. చేసే పనుల్ని బట్టే పొగడ్తలు వస్తాయి కాబట్టి. అధినేతల్ని , నేతల్ని ప్రసన్నం చేసుకునేందుకు చాలామంది అదే పనిగా ప్రశంసలు కురిపిస్తుంటారు.ఈ క్రమంలో సందర్భం, సమయం ఏంటనేది కూడా కొందరు చూడరు. అదే ఇప్పుడు ఆయన ఆగ్రహానికి కారణమైంది. ఈ వ్యవహారంతోనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Mk Stalin)ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. ఆయన తీసుకునే వినూత్న నిర్ణయాలతో ఇప్పటికే అందరి ప్రశంసలు అందుకున్నా..తనకు పొగడ్తలు సరిపడవంటున్నారు. సభా సమయంలో అదే పనిగా తనను పొగుడుతూ ప్రసంగం కొనసాగిస్తున్న సొంతపార్టీ నేతలకు సున్నితంగానే వార్నింగ్ ఇచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ(Tamilnadu Assembly)లో కడలూరు ఎమ్మెల్యే అయ్యప్పన్..ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, దివంగత నేతలు అన్నాదురై, కరుణానిధి(Karunanidhi)లను అదే పనిగా కీర్తిస్తూ సుదీర్ఘ ప్రసంగం కొనసాగించారు. దాదాపు ఐదు నిమిషాలు స్టాలిన్‌ను పొగుడుతూ ఉన్నారు. దాంతో ఎంకే స్టాలిన్ అభ్యంతరం తెలిపారు. తనపై ప్రశంసలు, పొగడ్తల ప్రసంగాలు వద్దని ఇంతకుముందే చెప్పానని..అయినా సరే సభ్యులు తమ వైఖరి మానుకోవడం లేదని చెప్పారు. ఎమ్మెల్యేలు అనవసర ప్రసంగాలు మానేసి, బడ్జెట్, సమస్యలపై చర్చించి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. సభా సమయాన్ని వృధా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Also read: India on Afghan Issue: ఆఫ్ఘన్ పరిణామాలతో మారిన ఇండియా వ్యూహమేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook