చెన్నై: తమిళనాడులోని విరుధునగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓ ఎన్నికల ప్రచారం సభ రసాబాసగా మారి అబాసుపాలైంది. ఎన్నికల సభ కవరేజ్ కోసం వచ్చిన ఫోటో జర్నలిస్టులు సభ వేదిక వద్ద ఖాళీ కుర్చీలను ఫోటోలు తీస్తున్నారనే ఆగ్రహంలో అక్కడే వున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారిపై దాడికి పాల్పడిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడిలో గాయపడిన ఫోటో జర్నలిస్ట్ ఆర్ఎం ముత్తురాజ్ ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే, తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వున్న కేఎస్ అళగిరి హాజరైన ఓ ఎన్నికల ర్యాలీకి వెళ్లిన ఫోటో జర్నలిస్టులకు అక్కడ ఖాళీగా వున్న కుర్చీలు దర్శనమిచ్చాయి. దీంతో ఖాళీ కుర్చీలను ఫోటో తీసేందుకు ప్రయత్నించిన ఫోటో జర్నలిస్టులపై అక్కడే ఉన్న పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడి వారి కెమెరాలు లాక్కున్న వైనాన్ని ఇతర జర్నలిస్టులు తమ వీడియో కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తీరుపై అనేక విమర్శలకు తావిచ్చింది.