Tamilnadu: తమిళనాడులో లాక్‌డౌన్ మరో వారం రోజులు పొడిగింపు
Tamilnadu: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. వివిధ రాష్ట్రాలు అన్‌లాక్ బాట పడుతున్నాయి. తమిళనాడులో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగానే ఉంది. ఇంకా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు.
Tamilnadu: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. వివిధ రాష్ట్రాలు అన్‌లాక్ బాట పడుతున్నాయి. తమిళనాడులో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగానే ఉంది. ఇంకా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు.
కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)ఉధృతి తగ్గుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 60 వేల కంటే తక్కువ నమోదవుతున్నాయి. కేసులు తగ్గుముఖం పట్టడంతో వివిధ రాష్ట్రాలు అన్‌లాక్ బాటపడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 28 వ తేదీ నుంచి ఢిల్లీలో కోవిడ్ ఆంక్షల్లో సడలింపులు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. సడలింపుల్లో భాగంగా పార్క్‌లు, నర్శరీలు, గోల్ఫ్ క్లబ్‌లకు అనుమతివ్వనున్నారు. బహిరంగ ప్రాంతాల్లో యోగా కార్యకలాపాలు, 50 శాతం సిట్టింగ్‌తో మద్యాహ్నం 12 నుంచి రాత్రి 10 గంటల వరకూ బార్లకు అనుమతులు ఇచ్చింది.
అటు తెలంగాణలో ఇవాళ్టి నుంచి లాక్‌డౌన్ పూర్తిగా తొలగించేశారు. ఏపీలో లాక్‌డౌన్ ఆంక్షల్లో సడలింపు ఇచ్చారు. తమిళనాడులో(Tamilnadu) మాత్రం కరోనా కేసుల సంఖ్య పూర్తిగా తగ్గకపోవడంతో మరో వారం రోజులు లాక్‌డౌన్ పొడిగించారు. ఈ నెల 28 వరకూ లాక్‌డౌన్ (Lockdown)ఉంటుందని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. ప్రజలంతా లాక్‌డౌన్ ఆంక్షల్ని పాటించాలని కోరింది.
Also read: Vaccination Offers; అక్కడ వ్యాక్సినేషన్ వేయించుకుంటే...50 శాతం డిస్కౌంట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook