Air India New CEO & MD : ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా టర్కిష్ ఎయిర్‌లైన్స్ మాజీ చైర్‌పర్సన్ ఇల్కర్ ఐసీని ( Ilker Ayci) టాటా సన్స్ సోమవారం నియమించింది. ఇల్కర్‌ అభ్యర్థిత్వాన్ని పరిశీలించడానికి ఎయిర్ ఇండియా బోర్డు సమావేశమైంది. ఈ సమావేశానికి ఎన్‌.చంద్రశేఖరన్‌ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఇల్కర్.. ఎయిరిండియా (Air India)  కొత్త సీఈవోగా ఏప్రిల్‌ 1 లేదా అంతకన్నా ముందే బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని టాటా సన్స్ (Tata Sons) తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇల్కర్‌ నియామకంపై చంద్రశేఖరన్‌ (N. Chandrasekaran) మాట్లాడుతూ.. "ఇల్కర్ ఏవియేషన్ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్నారు. టర్కిష్ ఎయిర్‌లైన్స్‌ను విజయవంతంగా నడిపించారు. ఎయిరిండియాను నవ శకం దిశగా నడిపించేందుకు... టాటా గ్రూపులోకి ఇల్కర్‌ను స్వాగతిస్తున్నాం. మాకు ఎంతో  సంతోషంగా ఉంది'' అని ఆయన అన్నారు.


"ఒక దిగ్గజ విమానయాన సంస్థకు నాయకత్వం వహించడం సంతోషంగా ఉంది. టాటా గ్రూప్‌లో చేరడం గౌరవంగా భావిస్తున్నాను'' అని ఇల్గర్ చెప్పారు. ఇటీవల టాటా గ్రూప్ ప్రభుత్వం నుండి ఎయిర్ ఇండియాను అధికారికంగా స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇల్కర్‌ ఐసీ 1971లో ఇస్తాంబుల్‌లో జన్మించారు. 


Also Read: Chinese Apps Ban: చైనాకు భారత్ షాక్... మరో 54 చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి