స్టేజ్‌పైనే మహిళా టీచర్‌కు ముద్దు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!
ఓవైపు మహిళా సాధికారత అని ఎన్నో చర్యలు తీసుకుంటుంటే విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు చేసిన పని వివాదానికి దారి తీసింది. టీచర్ అయి ఉండి ఇలాంటి పనులా అని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.
జైపూర్: బాలికలు బాగా చదువుకొని జీవితంలో స్థిరపడాలని, సొంతంగా బతకాలంటూ ఓ మహిళా టీచర్ అవగాహనా క్లాస్ తీసుకుంటున్నారు. మహిళలు ఇతరులపై ఆధారపడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకోవాలో చెబుతంటే క్లాసులోని విద్యార్థులంతా ఎంతో ఆసక్తిగా వింటున్నారు. కానీ అప్పుడే తరగతి గదిలోకి వచ్చి స్టేజీపై కూర్చున్న మహిళా టీచర్ చెంపపై ముద్దు పెట్టారు. నవ్వడం క్లాసురూములోని విద్యార్థుల వంతయింది. పురుష టీచర్ చేసిన పనికి ఆ మహిళా టీచర్ షాకైన ఘటన రాజస్థాన్ లోని కరౌలీలో చోటుచేసుకుంది.
Also Read: నిర్భయ దోషుల ఉరి వాయిదాపై దిశ తండ్రి సంచలన వ్యాఖ్యలు
ఇందుకు సంబంధించిన ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో వీడియోతో పాటు టీచర్ అసభ్య ప్రవర్తన వైరల్ అయింది. స్కూల్ యాజమాన్యం అసభ్యంగా ప్రవర్తించిన టీచర్‌పై చర్యలకు ఇంటర్నల్ కమిటీ వేసినట్లు సమాచారం. ఈ ఘటనపై రాజస్థాన్ ఉన్నతవిద్యాశాఖ మంత్రి భన్వర్ సింగ్ భాటిని మీడియా సంప్రదించింది. అయితే ఇలాంటి వీడియోలకు అంతగా ప్రాముఖ్యం ఇవ్వరాదని ఆయన చెప్పారు. మహిళలు, బాలికలు ఎంత ఉన్నతంగా ఉండాలి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటూ వారికి ఓ లేడీ టీచర్ చెబుతుండగా ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ చర్యకు పాల్పడిన టీచర్‌ను ఉద్యోగం నుంచి తీసివేయాలని డిమాండ్ చేస్తున్నారు.