అత్తగారింటి నుంచి ఏడుస్తూ వెళ్లిపోయిన మాజీ సీఎం కోడలు
అత్తగారింటి నుంచి ఏడుస్తూ వెళ్లిపోయిన మాజీ సీఎం కోడలు
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రులైన లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి దంపతుల కోడలు ఐశ్వర్యా రాయ్ శుక్రవారం తన అత్తగారింటి నుంచి ఏడుస్తూ వెళ్లిపోవడం బీహార్ రాజకీయవర్గాల్లో చర్చనియాంశమైంది. అత్తామామల ఇంటి నుంచి ఏడుస్తూ బయటికొచ్చిన ఐశ్వర్యా రాయ్.. తన తండ్రి, ఆర్జేడి (రాష్ట్రీయ జనతా దళ్) నేత చంద్రిక రాయ్ కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
[[{"fid":"179783","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, బీహార్ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌తో ఐశ్వర్యా రాయ్‌కి మే 2018లో వివాహమైంది. అయితే, పెళ్లి అయిన ఆరు నెలలకే భార్యతో తనకు పొసగడం లేదంటూ ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టాడు తేజ్ ప్రతాప్ యాదవ్. అంతేకాకుండా ఆమె వల్లే ఇంట్లో మనస్పర్థలు కూడా వస్తున్నాయని ఆరోపించాడు.
[[{"fid":"179784","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
తేజ్ ప్రతాప్ యాదవ్ తనపై ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ.. తాను మాత్రం పాట్నాలోని అత్తగారింట్లోనే ఉంటూ కాలం వెళ్లదీస్తూ వచ్చిన ఐశ్వర్వా రాయ్ ఆఖరికి ఈ ఏడాది ఆగస్టు నుంచే భర్తపై ప్రత్యారోపణలు చేయడం మొదలుపెట్టారు. తేజ్ ప్రతాప్ యాదవ్ డ్రగ్స్‌కి బానిసయ్యాడని.. అవి లేకుండా ఉండలేడని చెప్పిన ఐశ్వర్యా రాయ్.. ఆయన తనపై వేధింపులకు పాల్పడినట్టు తెలిపారు. తాను పెద్దగా చదువుకోలేదని అవహేళన చేశాడని ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాకుండా అతడి నుంచి రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేశారు. కేవలం పిల్లలకు జన్మనిచ్చి, వంటింటికే పరిమితమవ్వాలని వేధించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.