Supreme Court: సుప్రీంకోర్టులో కొత్త న్యాయమూర్తుల నియామకం జరిగింది. సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తిగా తెలంగాణ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ హిమకోహ్లి నియామకమయ్యారు. తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి నియామకం జరగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుప్రీంకోర్టు(Supreme court) కొలీజియం సిఫార్సు చేసిన 9 మంది న్యాయమూర్తుల నియామకం పూర్తయింది. దీనికి సంబంధించిన 9 మంది కొత్త న్యాయమూర్తుల ఉత్తర్వులపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేశారు. సుప్రీంకోర్టు కొత్త జడ్జీల నియామకం విషయమై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ఛీఫ్ జస్టిస్ హిమకోహ్లి నియమితులవడం గమనార్హం. సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా నియామకమైన 9 మందిలో జస్టిస్ హిమకోహ్లి(Justice Himakohli), బీవీ నాగరత్న, జస్టిస్ బేలత్రివేది, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ సిటి రవి కుమార్, జస్టిస్ సీఎస్ నరశింహ, జస్టిస్ సుందరేష్, జస్టిస్ నాగార్జున ఉన్నారు. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ(Justice NV Ramana) నేతృత్వంలోని కొలీజియం ఆగస్టు 18న 9 మంది న్యాయమూర్తుల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీరిలో ముగ్గురు మహిళలున్నారు. 


Also read: Odisha: ఒడిశాలో పతీసహగమనం.. భార్య మరణం తట్టుకోలేక..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook